»   » అలాంటి సీన్లు నేను చేయలేను: తమన్నా

అలాంటి సీన్లు నేను చేయలేను: తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరున్న మిల్కీ భామ తమన్నా బాహుబలి తో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజా సక్సెస్ "ఊపిరి" సినిమాతో మరింత ఊపుతో ఉంది. ఊపిరి హిందీ రీమేక్ లో కూడా తెలుగులో తను చేసిన పాత్రను తానే దక్కించుకుంది తమన్నా....

ఇప్పటికే పలు క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో 'దర్మదురై' చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు విశాల్ సరసన మరో సినిమా చేయడానికి ఓకే చెప్పింది.

ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న అభినేత్రి చిత్రంలో నటిస్తోన్న తమన్నా 'బాహుబలి-2'లో కూడా నటిస్తోంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అందంతో సినిమాలు చేస్తున్న ఈమెకు ఏడుపుగొట్టు సినిమాలంటే ఇష్టం ఉండదట.

I can't do sentiment scenes says Tamanna

" సినిమా అంటే కొద్దిసేపు ప్రేక్షకున్ని ఎంటర్టైన్ చేసేది. అక్కడకూడా భాదలే ఉంటే ఎలా..? నేనైతే అలంటి సీన్లుండే సినిమాల్ని చూడలేను. నా అభిమానులకీ అలా కనిపించి వారినీ భాద పెట్టలేను" అంటూ స్టేట్మెంటిచ్చేసింది. అయితే ఇదివర లో తమ్మూ కి ఎక్కువ పేరు తెచ్చిన "ఊసర వెల్లి", ఆవారా లాంటి సినిమాలని మర్చి పోయిందా..?

సినిమా అంటేనే రెండు గంటల సేపు ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ ఏడుపు తెప్పించే సినిమాల్లో అవకాశం వచ్చినా చేయననే చెబుతోంది. అయినా సినిమా అన్నాక సెంటిమెంటూ పండాలి కదా...! అది చేయనూ...ఇది చేయనూ అంటే ఉన్న అవకాశాలూ రావేమో...!

English summary
Tamanna says "she won"t accept the sentiment characters....
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu