»   » యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉదయభాను, సుమ లాంటి సీనియర్ యాంకర్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్లో శరవేగంగా దూసుకెలుతున్న యంగ్ యాంకరమ్మలు ముగ్గురున్నారు. వారిలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన అనసూయ, రష్మితో పాటు శ్యామల అనే మరో యాంకర్ కూడా ఉన్నారు. జబర్దస్త్ యాంకరమ్మలు హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంటే.... శ్యామల మాత్రం హోమ్లీ ఇమేజ్ సంపాదించుకున్నారు.

ఈ ముగ్గురు యాంకర్లు కూడా ఓ వైపు తమ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే సినిమాలోనూ తమ సత్తా చాటు తున్నారు. రష్మి ఇప్పటికే ‘గుంటూరు టాకీస్' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె సూపర్ హాట్ లుక్స్ తో పాటు ముద్దు సీన్లలో కూడా నటించింది. ఇక అనసూయ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో తన గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఓ ఊఫు ఊపింది. ఈ మధ్య పలు సినిమా ఫంక్షన్లలో అనసూయ హాట్ పెర్పార్మెన్స్ ఇచ్చింది.

సెక్సియెస్ట్ రీమార్క్స్: యాంకర్ అనసూయకు కోపం వచ్చింది!

I can't seriously turn an item girl: Anchor Syamala

అయితే మొదటి నుండీ హోమ్లీ ఇమేజ్ తో కొనసాగుతున్న శ్యామల మాత్రం సినిమాల్లో కూడా హోమ్లీగా ఉండే పాత్రలే చేస్తున్నారు. గ్లామర్ పాత్రలకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. ఒక లైలా కోసం, బెంగాల్ టైగర్ లో హీరో వదిన పాత్రల్లో నాటించి ఆకట్టుకున్నారు.

అయితే ఆల్రెడీ ఇద్దరు యాంకర్లు హీరోయిన్ పాత్రలు, ఐటం సాంగ్స్ లాంటివి చేస్తూ దూసుకెలుతున్న నేపథ్యంలో....మీకు కూడా ఇలాంటి పాత్రలు చేసే ఉద్దేశ్యం ఉందా అనే ప్రశ్న ఎదురైంది శ్యామలకు. దీనికి ఆమె స్పందిస్తూ... గతంలో తనకు ఐటం సాంగ్ అవకాశాలు వచ్చాయని... అలాంటి చేయడం నాకు ఇష్టం లేదు. డీసెంటుగా ఉండే పాత్రలే చేస్తాను అని సమాధానం ఇచ్చింది. మరి శ్యామలగారి మాటల్లో అంతరార్థం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది!

English summary
"Already many producers approached me for item numbers in big flicks, which I'm not game for. I can't seriously turn an item lady", anchor Syamala said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu