»   » ఎవరి మనో భావాలు దెబ్బ తినకూడదనే..కమల్ హాసన్

ఎవరి మనో భావాలు దెబ్బ తినకూడదనే..కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మన్మదబాణం'లో తాను రాసిన ఓ కవితను తొలగిస్తున్నట్లు నటుడు కమల్‌హాసన్‌ నిన్న(బుధవారం) విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. కమల్‌ త్రిషలపై చిత్రీకరించిన ఈ కవితలో దేవతల పేర్లు కించపరిచేవిధంగా ఉన్నాయంటూ 'హిందూమక్కల్‌కచ్చి' చెన్నైలో కమల్‌హాసన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. దీంతో తన చిత్రానికి రాజకీయరంగు పులమడం సహజమేననీ, ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించేలా హాస్యచిత్రంగా మలిచామనీ, అందుకని ఎవరి మనోభావాలు ఇబ్బందిపెట్టకుండా కవితను తొలగిస్తున్నామనిని' వెల్లడించారు. ఈ చిత్రం ఈ రోజు(గురువారం) విడుదలకానుంది.ఇక ఈ చిత్రంలో కమల్‌ మూడు పాటలు పాడటం విశేషం. 'దశావతారం' తరవాత కమల్‌ - రవికుమార్‌ కలయికలో రూపొందిన చిత్రమిదే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu