»   » సెక్స్ కామెడీ: ఆ దర్శకుడుతో మళ్లీ చేయనంటున్న హీరోయిన్

సెక్స్ కామెడీ: ఆ దర్శకుడుతో మళ్లీ చేయనంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన ‘త్రిష ఇల్లాన నయనతార' మూవీ తెలుగులో ‘త్రిష లేదా నయనతార' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సౌత్ లో వచ్చిన బోల్డ్ సెక్స్ కామెడీ సినిమాల్లో ఇదీ ఒకటి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ జోక్స్, అభ్యంతరకర డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని పెద్దలకు మాత్రమే పరిమితమైన ‘ఎ' సర్టిఫికెట్ కేటగిరీలో చేర్చింది.

ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన ఆనంది మాట్లాడుతూ....సినిమా విడుదలయ్యే వరకు ఇది సెక్స్ కామెడీ చిత్రమని తెలియదని, అలా అని తెలిస్తే తాను ఈ సినిమా చేసేదాన్ని కాదని వెల్లడించింది. తనకు ఈ సినిమా ఓ క్యూట్ టీనేజ్ లవ్ స్టోరీ అని చెప్పి ఒప్పించారని, సినిమా విడుదలైన తర్వాత షాకయ్యానని తెలిపింది.


I Did Not Know Trisha Illana Nayanthara Was An Adult Comedy

దర్శకుడు తనను మోసం చేసి ఈ సినిమాకు సైన్ చేయించుకున్నాడని, మరోసారి ఆ దర్శకుడితో చేసే ప్రసక్తే లేదని ఆనందిని స్పష్టం చేసింది. త్రిష ఇల్లాన నయనతార సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మాజీ హీరోయిన్ సిమ్రన్ కూడా అతిథి పాత్రలో నటించడం గమనార్హం.


జి.వి.ప్రకాష్, ఆనందిని(రక్షిత), మనీషా యాదవ్, సిమ్రాన్, ఆర్య (గెస్ట్) ప్రియాఆనంద్ (గెస్ట్) నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ, సంబాషణలు: శశాంక్ వెన్నెలకంటి, ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్ నాదన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆదిక్ రవిచంద్రన్.

English summary
Trisha Illana Nayanthara (TIN) was undoubtedly one of the boldest films in the recent times as the movie's core subject was adult in nature. Surprisingly, in an interview to the Times of India, one of the leading ladies of the film has revealed that she wouldn't have been a part of the film had she known the fact Trisha Illana Nayanthara was an adult comedy.
Please Wait while comments are loading...