»   » రానాని నేను కొట్టలేదు: దర్శకుడు తేజా

రానాని నేను కొట్టలేదు: దర్శకుడు తేజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తేజ ఓ పదేళ్ళ కిందట టాలీవుడ్ లో ఒక యువసంచలనం.ప్రతీ సినిమా లోకి కొత్త వాళ్ళని తెచ్చేయటం ఆ ఒక్క సినిమాతో వాళ్ళని ఓవర్నైట్ స్టార్ చేసేయటం, నితిన్, ఉదయ్ కిరణ్, సదాఫ్, అనిత ఇలా చాలామందినే తెరమీదకి తెచ్చాడు తేజ... తర్వాత ఆ స్టార్ డం ని నిలబెట్టుకోవటం లో వాళ్ళు తడబడ్డారు కానీ ఒకే ఒక్క సినిమాతో వాళ్ళకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకువచ్చింది తేజా అంటం లో ఏ సందేహమూ లేదు.

తేడాకూడా చూడకుండా కొట్టేవాడట

తేడాకూడా చూడకుండా కొట్టేవాడట

అయితే వచ్చినవాళ్ళంతా కొత్తవాళ్ళే కాబట్టి., వాళ్ళనుంచి నటన రాబట్టటానికి కాస్త కఠినంగానే ఉండేవాడు తేజా... ఒక్కొసారి సెట్స్ మీద హీరో, హీరోయిన్, జూనియర్ ఆర్టిస్ట్ అనే తేడాకూడా చూడకుండా కొట్టేవాడన్నది చాలామందే చెప్పుకున్నారు. ఆ తర్వాత తేజా వెనకబడ్డాడు... నెమ్మదిగా అసలు తేజా సినిమా తీస్తున్నాడూ అంటే "అలాగా.." అని వదిలేసేంత లైట్ తీస్కున్నారు.

Rana And Kajal @ Nene Raju Nene Mantri Press Meet Bangalore
మళ్ళీ ఒక సెన్సేషన్ తో

మళ్ళీ ఒక సెన్సేషన్ తో

అయితే ఇప్పుడు మళ్ళీ ఒక సెన్సేషన్ తో వచ్చాడు. రానా లాంటి హీరో తో తేజా సినిమా అనగానే ఎక్కువమంది ఆలోచించింది ఇదే. రానా మీదకి కూదా తేజా అదేకోపం చూపిస్తాడా అన్నదే ఎక్కువమంది అనుకున్నది.... అదే విశయాన్ని ఈ మధ్య ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పాడు తేజా

అదే యాటిట్యూడ్ చూపిస్తాడు

అదే యాటిట్యూడ్ చూపిస్తాడు

"రానా చాలా ఇంటెలిజెంట్ యాక్టర్. ఏదైనా ఒక సీన్ గురించి చెప్తే రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ పొద్దున్నే ఆ సన్నివేశానికి ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే నటిస్తూ అదే యాటిట్యూడ్ చూపిస్తాడు. అలాంటి నటులు అరుదనే చెప్పాలి. సెట్ లో రానాలా కాకుండా జోగేంద్రలా బిహేవ్ చేసేవాడు. రానాలో ఆ ఇంటెలిజెంట్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది". ఇంత తెలివైన నటుడిపై చేయిచేసుకునేంత అవసరం ఎవరికీ ఉండదంటున్నాడు తేజ.

రానా అలా కాదు

రానా అలా కాదు

కెరీర్ లో చాలాంది కొత్త హీరోలతో వర్క్ చేశాడు తేజ. ఉదయ్ కిరణ్, తేజ లాంటి నటుల్ని పరిచయం చేసిన ఈ దర్శకుడు వాళ్లను కొట్టినా.. వాళ్లు పరిశ్రమకు కొత్త కాబట్టి నడిచిపోయింది. కానీ రానా అలా కాదు. ఈ సినిమా కంటే ముందు బాహుబలి-2 లాంటి భారీ విజయం అతడి చేతిలో ఉంది. దీన్ని పక్కనపెడితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత సురేష్ బాబు తనయుడు రానా. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోపై చేయి చేసుకుంటే ఏమౌతుందో తేజకు తెలియంది కాదు.

English summary
Director Teja Who is directing a movie "Nene Raju Nene Mantri" with Rana says about why he dint beat hero Rana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu