twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ హిట్ అయినా నాలో ఏ మార్పూ రాలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ ‌: సినిమా హిట్ అయితే ఆ సినిమా హీరోకే కాదు అందులో నటించిన ఆర్టిస్టులు,టెక్నిషియన్స్ కు అందరికీ డిమాండ్ పెరిగిపోతుంది. అలాగే వారి బిహేవియర్ కూడా మారుతుంది. అయితే తనవరకూ అలాంటిదేమీ లేదు అంటున్నారు నవాజుద్దీన్ సిద్దిఖీ.

    'బజరంగీ భాయిజాన్‌'లో పాకిస్థానీ టీవీ రిపోర్టర్‌ చాంద్‌ నవాబ్‌గా ఆకట్టుకున్నాడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ. ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ లభిస్తున్నాయి. తనకొస్తున్న గుర్తింపు పట్ల నవాజుద్దీన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

    నవాజుద్దీన్ మాట్లాడుతూ... ''బజరంగీ..' చూసినవారంతా నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా తరవాత పరిశ్రమ వ్యక్తులు నన్ను చూసే విధానం మారింది. కానీ నాలో ఏ మార్పూ రాలేదు. కెరీర్‌లో విజయవంతమయ్యానని కూడా అనుకోవడంలేదు. వైవిధ్యమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. నా దృష్టంతా దానిపైనే ఉంటుంది''అన్నారు నవాజుద్దీన్‌.

    అలాగే...తన తాజా చిత్రం 'మాంఝీ: ది మౌంటెన్‌ మ్యాన్‌' చిత్రంలో ఈయన ప్రధాన పాత్రలో నటించారు. కెరీర్‌లోనే అది సవాల్‌ లాంటి పాత్ర అని చెప్పారు. ఈ నెల 21న ఆ చిత్రం విడుదలవుతోంది.

    I don't believe I am successful, says Nawazuddin Siddiqui

    ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఏదీ అంటే 'భజరంగీ భాయ్‌జాన్‌'. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది.

    భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న 'బజరంగీ భాయిజాన్‌' 500 కోట్లకు చేరుకున్నాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. గత నెల 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో సుమారు రూ.510 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. మన దేశంలో రూ.373.54 కోట్లు దక్కించుకోగా, విదేశాల్లో రూ.136 కోట్లు సాధించింది.

    'పీకే'(రూ.735 కోట్లు), 'ధూమ్‌ 3' (రూ. 542 కోట్లు)లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌ వసూళ్ల విషయానికొస్తే 15 రోజులకు మన దేశంలో 'బజరంగీ...' రూ.276.36 కోట్లు వసూలు చేసింది. 'పీకే' (రూ. 338 కోట్లు), 'ధూమ్‌ 3' (రూ.284 కోట్లు)లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ వసూళ్లను 'బజరంగీ..' అధిగమించడం ఖాయమంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుండీ ఇది చిరంజీవి సూపర్ హిట్ చిత్రం పసివాడి ప్రాణం కథ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిలీజై అంతటా అదే జోరుగా వినిపిస్తోంది. ఈ విషయమై ఈ చిత్రం కథ రచయిత విజియేంద్రప్రసాద్ సైతం నిజమైనన్నట్లు సమాచారం.

    I don't believe I am successful, says Nawazuddin Siddiqui

    విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి 1987లో నటించిన పసివాడి ప్రాణం చిత్రం నన్ను అప్పట్లో బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో కాంటెంపరెరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ లోగా తాను ఓ పాకిస్దానీ జంట...తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు..అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్త రావటం గమనించానని..కథని సిద్దం చేసానని అన్నారు. పసివాడి ప్రాణం సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే..ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది.

    ఇక చిత్రం విషయానికి వస్తే...

    తాను ఇటీవల నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయమై యూపి గవర్నమెంట్ స్పందించి... 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.

    వివరాల్లోకి వెళితే.. తమ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు అమలుచేయవలసిందిగా సల్మాన్‌ఖాన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ను కలిసి చర్చించారు. దీంతో భజరంగీ భాయ్‌జాన్‌కు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారవర్గాల వెల్లడించాయి.

    పాకిస్థాన్‌ బాలికను స్వగ్రామానికి చేర్చేందుకు ఓ భారత యువకుడు ప్రయత్నించిన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని తాను కోరుకుంటున్నానని, అయితే పన్ను మినహాయింపు ఇస్తే సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఉపయోగించినట్లే అవుతుందని సల్లుభాయ్‌ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సామాజిక కోణంలో చూడాలని భారత, పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌ షరీఫ్‌లకు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు.

    I don't believe I am successful, says Nawazuddin Siddiqui
    ఈ చిత్రం గురించి అమీర్ ఖాన్ పొడగ్తల్లో ముంచెత్తారు..భజరంగీ భాయ్‌జాన్‌ను ఆమిర్‌ ముంబయిలో వీక్షించాడు. సల్మాన్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం. అదరగొట్టేశాడంటూ సల్మాన్‌ని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచేశాడు. ఇప్పటి వరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో భజరంగీ భాయ్‌జాన్‌ ద బెస్ట్‌, మంచి కథ, సంభాషణలు, కబీర్‌ ఖాన్‌ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ ఆమీర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

    'బజరంగీ భాయిజాన్‌' చూసినవాళ్లలో చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా పతాక సన్నివేశాల్లో సల్మాన్‌ కంటతడి పెట్టించాడని సామాజిక అనుసంధాన వేదికల్లో రాసుకొస్తున్నారు. కథానాయకుడు ఆమీర్‌ ఖాన్‌ ఇటీవల ముంబయిలో ఈ సినిమా చూసి బయటకొస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు.

    ఆ తర్వాత ''సినిమా బాగుంది. ఇప్పటివరకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ సినిమాల్లో ఇదే అత్యుత్తమం. సల్మాన్‌ నటన అద్భుతంగా ఉంది. కథ, కథనం, సంభాషణలు చాలా బాగా కుదిరాయి. కబీర్‌ ఖాన్‌ చక్కటి సినిమా తీశాడు. అందరూ చూడదగ్గ సినిమా. చిన్నపాప హర్షాలీ మీ మనసులు దోచుకుంటుంది'' అని ట్వీట్‌ చేశాడు ఆమీర్‌ ఖాన్‌.

    దర్శకుడు మాట్లాడుతూ... ''కొత్త కొత్త ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరపడం అంటే నాకు చాలా ఇష్టం. అనేక ప్రాంతాలు పరిశీలించి ఈ సినిమా కోసం లొకేషన్లు ఎంచుకున్నాను. కొండలు, గుట్టలు, హిమానీనదాలు.. ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ అయితే మనమిద్దరం ట్రెక్కింగ్‌ చేస్తూ లొకేషన్‌కు వెళ్దాం అనేవారు'' అని చెప్పారు కబీర్‌ ఖాన్‌. భారత్‌- పాక్‌ నేపథ్యంలో సినిమాలు తీయడం ఈయన ప్రత్యేకత.

    English summary
    Having won both critical as well as box-office applause for his role in the Salman Khan starrer Bajrangi Bhaijaan, actor Nawazuddin Siddiqui says he still does not consider himself to be successful.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X