»   » రాయిస్ తో కాబిల్ ఢీ: షారుక్ తో పోరుపై హృతిక్ ఏమన్నాడంటే..

రాయిస్ తో కాబిల్ ఢీ: షారుక్ తో పోరుపై హృతిక్ ఏమన్నాడంటే..

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

మీరు ఊహించినట్టుగా షారుక్ ఖాన్ తో అమీతుమీ తెల్చుకొనేంతగా విభేదాలు లేవని అంటున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. షారుక్ తో వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలు మంచిగానే ఉన్నాయంటున్నాడు ఈ కండల వీరుడు. బాలీవుడ్ బాద్షా షారుక్ నటించిన రాయిస్, హృతిక్ రోషన్ నటించిన కాబిల్ చిత్రాలు ఈ నెల 25న బాలీవుడ్ లో విడుదల కానుండటంతో ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది. రెండు భారీ చిత్రాల విడుదల నేపథ్యంలో అగ్రనటుల మధ్య తీవ్ర స్థాయిలో భారీ పోరుకు తెరలేసిందంటూ మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

Shahrukh Khan: Hrithik Roshan

మీడియా కథనాలపై హృతిక్ స్పందిస్తూ.. 'అగ్ర హీరోల చిత్రాలు ఒకేరోజున విడుదల కావడం కొత్తేమి కాదు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే సినిమాలు విడుదల అవుతున్నాయి. అంతమాత్రాన ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదు'అని అన్నాడు. తన తండ్రి రాకేశ్ రోషన్ నిర్మాణ సారథ్యంలో ఆరోసారి నటించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు.

తమ మధ్య సెట్లో కొన్ని అంశాలపై తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతుంటాయని, అయితే అవి క్రియేటివిటికి సంబంధించినవేనని అన్నాడు. ప్రస్తుతం కాబిల్ చిత్రం తనకు ప్రత్యేకమని, దర్శకుడు సంజయ్ గుప్తా తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని పేర్కొన్నాడు. గత కొద్దికాలంగా ఫ్లాప్ లతో సతమతమతున్న హృతిక్ కాబిల్ తో మరోసారి అదృష్టాన్ని పరీక్షీంచుకోవడానికి సిద్ధమయ్యాడు.

English summary
Bollywood star Hrithik Roshan explained relations with Shahrukh Khan. His movie kaabil is get ready for the release on January 25th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu