బెజవాడ రౌడీలు గురించి నాకేమాత్రం తెలియదు: నాగార్జున

By Sindhu

బెజవాడ రౌడీలు చిత్రంతో తనకేమాత్రం సంబంధం లేదనీ, ఆ చిత్రం టైటిల్ గురించి హీరో నాగచైతన్యను గానీ, రామ్ గోపాల్ వర్మను గానీ అడగాలని హీరో నాగార్జున జర్నలిస్టులకు సూచించారు. ఈరోజు ఓ షాపు ఓపెనింగుకి ఆయన విజయవాడ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్ వివాదం గురించి ఆయనను అడిగినప్పుడు ఆయనలా స్పందించారు.

'ఆ సినిమాలో నాగచైతన్య హీరో. దానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి వాళ్లిద్దర్నీ అడిగితే సమంజసంగా వుంటుంది. నేనేం చెబుతాను?' అంటూ నాగార్జున తప్పించుకున్నారు. మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ, అవకాశం వస్తే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ లతో కలిసి నటిస్తానని చెప్పారు నాగార్జున. ఆ అవకాశం త్వరలోనే రావచ్చని కూడా సూచనప్రాయంగా చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X