Just In
Don't Miss!
- Sports
ప్రపంచం ఏమైనా పిచ్చిదా?.. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే అతడిని ఎందుకు తీసుకోలేదు: మైకేల్ వాన్ ఫైర్
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలాంటి మూర్ఖుడిని కాదు.. నేరం చేసినట్టు చూస్తున్నారు.. సాహో దర్శకుడు సుజిత్
'సాహో' విడుదల తర్వాత మిక్డ్స్ టాక్ రావడం, విమర్శకుల నుంచి నెగెటివ్ రివ్యూలు రావడం, కొందరు విమర్శకులు ఇదంతా దర్శకుడు సుజీత్ వైఫల్యమే అన్నట్లు కామెంట్స్ చేస్తుండటం తెలిసిందే. ఇటీవలే డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్న సుజీత్ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు.
'సాహో' విషయంలో తనపై వస్తున్న విమర్శలపై సుజీత్ రియాక్ట్ అవుతూ... ''నేను ప్రభాస్ సర్‌తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ చిత్రం చూశారు. అయినప్పటికీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు'' అని సుజీత్ చెప్పుకొచ్చారు.

నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు
నన్ను టార్గెట్ చేస్తూ అందరూ ఎందుకు వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదు. నేను చివరగా మూవీ రిలీజైన ఒక రోజు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. ‘నో కామెంట్స్' అని నేను చెప్పినా కూడా అది ఇంటర్వ్యూగా మారిపోతోంది, ఆ కామెంట్లను కూడా నాకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సుజీత్ చెప్పుకొచ్చారు.

నేను అలాంటి మాట ఎప్పుడూ చెప్పలేదు
బీహార్‌లో కొందరు అభిమానులు ఫోన్ చేసి గుడి కడతారని సుజీత్ చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సుజీత్ స్పందిస్తూ... ‘నేను అసలు ఆ మాట ఎప్పుడూ అనలేదు. నాకు అలాంటి మాటలు చెప్పే అలవాటు కూడా లేదు' అని సుజీత్ చెప్పుకొచ్చారు.

నేను భక్తుడిని మాత్రమే
నేను మూర్ఖంగా గొప్పులు చెప్పుకునే రకం కాదు... ఒక వేళ అలా చేస్తే మా అమ్మ చంపేస్తుంది అంటూ సుజీత్ వ్యాఖ్యానించారు. ‘‘అభిమానులు రజనీకాంత్, మమ్ముట్టి లాంటి గొప్ప గొప్ప స్టార్ల కోసం ఆలయాలు కట్టారు. అలాంటి ఆలయాల వద్ద నేను భక్తుడిని మాత్రమే. సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. సినిమాను ప్రేమించండి లేదా ద్వేషించండి. అంతే కానీ నన్ను టార్గెట్ చేయడం ఎందకు? అని సుజీత్ వాపోయారు.

ఈ సమయంలో ఇలా జరుగడం నా దురదృష్టం
సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే సమయంలో దురదృష్టవశాత్తు నేను మంచం పట్టాను. ప్రభాస్ సర్, నిర్మాతలు నాకు సపోర్టుగా ఉన్నారు. ఇపుడు నా జీవితంలో జరిగిన మంచి అంటే అదే. విమర్శలను క్షుణ్ణంగా పరిశీలించినపుడు మౌనంగా ఉండటమే మంచిది అనిపించిందని సుజీత్ వెల్లడించారు.

సాహో
‘సాహో' మూవీ కలెక్షన్ విషయానికొస్తే... రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ. 600 కోట్లు వసూలు కావాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.