»   » ఆమెతో పోల్చుకునే ధైర్యం చేయలేను: ఇలియానా

ఆమెతో పోల్చుకునే ధైర్యం చేయలేను: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :విద్యాబాలన్‌ ఓ అద్భుతమైన నటి. ఆమెతో పోల్చుకునే ధైర్యం చేయలేను. తనలాంటి పాత్రలు నాకు రావాలంటే, నేను సినిమా ఇన్నింగ్స్‌ను మొదట్నుంచీ మొదలుపెట్టి నటనకు అవకాశమున్న పాత్రల కోసమే ప్రయత్నించాలి. ఇప్పుడా అవకాశం లేదు అంటోంది ఇలియానా. 'కహానీ సినిమాలో విద్యాబాలన్‌ లాంటి పాత్ర ఒక్కటొస్తే చాలు, నేనేంటో నిరూపించుకుంటా'.. డ్రీం రోల్‌ గురించి అడిగితే దాదాపు అందరు హీరోయిన్లూ ఇలాంటి మాటలే చెబుతారు. ఇలియానాను కదిలిస్తే మాత్రం అలాంటి పాత్రలు వద్దుకాక వద్దు అంటుంది.

'నాకు మొదటి సినిమా నుంచీ గ్లామర్‌ పాత్రలే వస్తున్నాయి. వాటిలో నా పాత్రకు నటించే అవకాశం తక్కువగా ఉన్నా, ఆ సినిమాలు హిట్‌ అవుతున్నాయి కదా. సినిమా కథంతా నా చుట్టూనే తిరగాలన్న స్వార్థం నాకు లేదు. అభిమానులకు నన్ను గ్లామర్‌ గాళ్‌గా చూడటమే ఇష్టం. అందుకే నటనకు ఆస్కారం లేకపోయినా నా పాత్ర వాళ్లని మెప్పిస్తే చాలు ఇలియానా.

ఇలియానా మాట్లాడుతూ... 'కత్రినా అంటే చాలాచాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే... నాకు స్ఫూర్తి కూడా. ఎందుకంటే, ఆమె బాలీవుడ్‌కి వచ్చేనాటికి ఇక్కడి భాష తెలీదు. పరిశ్రమ తీరు తెన్నులు తెలీవు. అయినాసరే, పట్టుదలతో ఎదిగింది. మొదట్లో ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అయినా రాజీ పడలేదు. తెలియని విషయాలన్నీ నేర్చుకుంటూ ఈరోజున నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. ఆమెలోని పోరాట పటిమ చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా మూడ్‌ ఆఫ్‌ అనిపిస్తే కత్రినా నటించిన సినిమాలు చూసి రీఛార్చ్‌ అయిపోతుంటాను' అని చెప్పుకొచ్చింది ఇలియానా.

తెలుగులో రామ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం 'కందిరీగ'. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 'మై తేరా హీరో' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఖరారు చేసి చెప్పారు. అలాగే ... బర్ఫీతో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌తో నటిస్తోంది. ఇప్పుడు మూడో చిత్రం కూడా సిద్ధమైంది. త్వరలో ఆమె సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి నటించబోతోంది. ఈ సినిమాకి రాజ్‌ నిడిమోరు, కృష్ణ డి.కె. సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. సైఫ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో చిత్రీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.

English summary
Ileana D’Cruz said that she is not a Vidya Balan. Don’t think much that how she dared to confess this bold statement. Ileana quoted Vidya for good reason only she compared herself with Vidya Balan in terms of acting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu