»   » బిపాసాతో నాకు సంబందాల్లేవ్..నేను ఆమెను పెళ్ళి చేసుకోను

బిపాసాతో నాకు సంబందాల్లేవ్..నేను ఆమెను పెళ్ళి చేసుకోను

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ప్రేమ జంట జాన్ అబ్రహాం..సెక్సీభామ బిపాసా బసు విడిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా జాన్ అబ్రహాం వెల్లడించాడు. 'గతంలో కలిసే ఉన్నాం..సహజీవనం చేశాం..భార్యభర్తల్లానే వ్యవహరించాం. చిన్నచిన్న మనస్పర్థలొచ్చాయి..విడిపోవాలనుకున్నాం..విడిపోయాం.." అంటూ తమ మధ్య బంధం తెగిపోయిన విషయాన్ని జాన్ అబ్రహాం స్పష్టం చేశాడు. అంతలోనే, మేమిద్దరం ఇంకా స్నేహితులమే..అయితే గతంలో వున్న 'బంధం" తెగిపోయినట్టే..ఇక అతుక్కునే ప్రశ్నే లేదని తేల్చేశాడు జాన్ అబ్రహాం.

నిజానికి వీళ్లిద్దరూ విడిపోయి చాన్నాళ్ళే అయినా..ఇద్దరూ ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు..దానికి కారణమూ లేకపోలేదు. పెళ్ళి కాకున్నా మేమిద్దరం భార్యా భర్తలమే..అంటూ గాఢమైన స్టేట్ మెంట్లు గతంలో ఇచ్చేయడం వల్లే..విడిపోయామని చెప్పుకోవడానికి ఇంతగా జాన్, బిపాసా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇంకా బిపాసా, తాను జాన్ తో తెగతెంపులు చేసుకున్న విషయం ప్రకటించకపోవడం గమనార్హం. అదెంత పనిగానీ..ఇద్దరూ ఆల్రెడీ తమతమ కొత్త లవర్స్ వేటలో ఉన్న సంగతి తెల్సిందే.

English summary
Bollywood actor John Abraham talks about Bipasha Basu and his breakup in simigrewal selects India's Most Desirable show. He is the guest on this week's episode.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu