»   » యాంకర్ హాట్‌గా ఉందని అడిగారు, నో చెప్పింది

యాంకర్ హాట్‌గా ఉందని అడిగారు, నో చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లు, పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ల ప్రాముఖ్యత పెరిగి పోయింది. తెలుగు తెరపై యాంకర్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఝాన్సీ, సుమ, అనసూయ లాంటి వారు ఉన్నారు. తాజాగా మరో యాంకర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, హీరోయిన్‌కు ఏ మాత్రం తీసి పోని అందం, నిర్మాలమైన ముఖారవిందం ఆమె సొంతం. ఆమె మరెవరో కాదు టీవీ యాంకర్ శ్యామల. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల ఆ తర్వాత కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Anchor Syamala

ఈ క్రమంలో పలు టాలీవుడ్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు యాంకర్ చేస్తూ అందరి దృష్టిలో పడింది. దీంతో పలువురు దర్శకులు ఆమెలోని యాక్టింగ్ స్కిల్స్, అందం చూసి తమ సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు. ఇటీవల విడుదలై గోపీచంద్ ‘లౌక్యం', నాగ చైతన్య ‘ఒక లైలా కోసం' చిత్రంల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది.

ఆ తర్వాత కొందరు ఫిల్మ్ మేకర్స్ ఆమెను తమ సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయాలంటూ సంప్రదించారట. అయితే అలాంటి ఉద్దేశ్యం తనకు లేదని, కేవలం ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాతలు మాత్రమే చేస్తానని తేల్చి చెప్పిందట శ్యామల.

English summary
Anchor Syamala, who has acted in Loukyam and Oka Laila Kosam, has been reportedly approached for 'special songs' for a bunch of upcoming Telugu films; however, she makes it clear that she doesn't want to be part of any such songs.
Please Wait while comments are loading...