»   » ఇక అలాంటి ఆఫర్ల వస్తే నటించను.. మళ్లీ ఆ తప్పు చేయను.. సుప్రియ

ఇక అలాంటి ఆఫర్ల వస్తే నటించను.. మళ్లీ ఆ తప్పు చేయను.. సుప్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాబు బాగా బిజీ సినిమాతో ఒక్కసారిగా తెరపై వేడి పట్టించింది అందాల తార సుప్రియ ఐసోలా. గతంలో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైనా అంతగా గుర్తింపు నోచుకోలేదు సుప్రియ. తాజాగా బాబు బాగా బిజీలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. బాబు బాగా బిజీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ చిత్రం హిందీలో విజయం సాధించిన హంటర్‌కు రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే.

చంద్రిక పాత్రలో చక్కగా

చంద్రిక పాత్రలో చక్కగా

నేను బాబు బాగా బిజీ చిత్రంలో చంద్రిక పాత్ర పోషించాను. గృహిణిను పోషించాను. భర్త నిరాదరణకు గురై.. ప్రియుడి ప్రేమ కోసం పాకులాడే పాత్ర నాది. చంద్రిక పాత్రలో చక్కగా నటించావని ప్రేక్షకులు, సన్నిహితులు మెచ్చుకుంటున్నారు అని సుప్రియా తెలిపారు.

హంటర్‌లో ఓ సీన్‌ను చూపించి

హంటర్‌లో ఓ సీన్‌ను చూపించి

దర్శకుడు నవీన్ హిందీ చిత్రం హంటర్‌లో ఓ సీన్‌ను చూపించి నీదైన శైలిలో చేయడానికి ప్రయత్నించు అని చెప్పారు. పాత్ర పరిధి మేరకు నాకు తోచిన విధానంలో నటించా. వెంటనే దర్శకుడు నాకు ఆ పాత్రను ఇచ్చారు అని అన్నారు.

ఆఫర్లు వస్తే నటించను

ఆఫర్లు వస్తే నటించను

ప్రస్తుతం మంచి నటిగా స్థిరపడాలని అనుకొంటున్నాను. ఇకపై బాబు బాగా బిజీ పాత్రలాంటి ఆఫర్లు వస్తే నటించను. ఒప్పుకొను. కేరీర్ ప్రారంభంలో అలాంటి తప్పులు చేయను అని సుప్రియ పేర్కొన్నారు.

మహేశ్‌బాబుతో కలిసి

మహేశ్‌బాబుతో కలిసి

గతంలో సుప్రియ ఐసోలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించింది. మహేశ్‌బాబుతో కలిసి ట్రైన్ సీన్‌లో నటించింది. మహేశ్‌బాబు ఫోన్ మరిచిపోతే మీరు ఫోన్ మరిచిపోయారు అని డైలాగ్ చెప్పే సీన్‌లో కనిపించారు. అందుకు మహేశ్ కావాలనే మర్చిపోయాను అని అనగా.. అయితే డైరెక్ట్‌గా చెప్పవచ్చుగా అని సుప్రియ అంటుంది. రైల్వేస్టేషన్‌లో దిగి వస్తుంటే వెంకటేష్ ఎదురు రాగా మహేశ్ దారి అటూ అంటూ అడ్రస్ సీన్‌ బాగా పడింది. చిన్న సీన్‌లో కనిపించిన సుప్రియకు తగిన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది.

English summary
Actor Supriya ayosola acted hot aunty in Babu baga busy. She recently speak wit media about her latest movie. She said I was getting good response for chandrika character. She told that I will not accept such kind of roles further.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu