»   » అతనితో నటించను.. ఇదే చివరి చిత్రం.. కత్రినా

అతనితో నటించను.. ఇదే చివరి చిత్రం.. కత్రినా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ మాజీ ప్రేమికులు కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'జగ్గా జాసూస్‌'. అయితేఈ సినిమా తర్వాత తాను రణ్‌బీర్‌తో ఇంకే చిత్రంలోనూ నటించబోనని తెగేసి చెప్పింది కత్రినా . జగ్గా జాసూస్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

జగ్గా జాసూస్ చిత్రం తర్వాత హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించను అని కత్రినా కైఫ్ స్పష్టం చేసింది. జగ్గా జూసూస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మాజీ ప్రేమికులైన కత్రినా, రణ్‌బీర్ ప్రస్తుతం జగ్గా జాసూస్ చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

I dont act with Ranbir kapoor, says Katrina kaif

చాలా రోజుల తర్వాత రణ్‌బీర్‌తో కలిసి పనిచేశాను. అతనితో పనిచేయడం చాలా కష్టంగా అన్పించింది. షూటింగ్‌ సమయంలోనే నాతో మరో సినిమాలో నటించనని రణ్‌బీర్‌ చెప్పాడు. దాతో నేను కూడా అతనితో మరే సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను అని కత్రినా వెల్లడించింది.

హిందీలో రెండు సినిమాల్లో కలిసి నటించిన రణ్‌బీర్‌, కత్రినా 2011లో ప్రేమించుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఒకే అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేశారు. వారి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఆ మధ్యలో విదేశాలకు వెకేషన్‌కు వెళ్లి మీడియాకు చిక్కారు. అయితే వారు విడిపోవడానికి రణబీర్ తల్లి కారణమని అప్పట్లో పుకారు.

English summary
Katrina kaif says that I do not work with Ranbir Kapoor again. Jagga Jasoos is the last movie. It was tough time acting with Ranbir in Jagga Jassos sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu