»   » బాలయ్యను ఏడిపిస్తున్నవాడు దొరికాడు

బాలయ్యను ఏడిపిస్తున్నవాడు దొరికాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణను వెటకారం చేస్తూ కుళ్ళు జోకులు ప్రచారం చేస్తున్న ఐ హేట్ బాలయ్య డాట్ కాం నిర్వాహకుడుని పోలీసులు లొకేట్ చేసారు. సిడ్నీకి చెందిన అత్తిలి రాజేంద్రరెడ్డి ఈ సైట్ ని రన్ చేస్తున్నట్లు కనుక్కున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న రాజేంద్ర రెడ్డి కేవలం బాలకృష్ణ సైట్ మాత్రమే కాక ఐ హేట్ చిరంజీవి సైట్ ని కూడా రన్ చేస్తున్నారు. ఇద్దరి అబిమానుల మధ్యా పుల్లలు పెట్టి వినోదం చూస్తున్నారు. మొదట్లో వినోదం కోసం ప్రారంబించిన ఈ సైట్స్ తర్వాత కాలంలో పూర్తిగా నెగిటివ్ గా మారిపోవటం జరిగింది. అంతేగాక సర్దార్జీ జోక్‌లను బాలకృష్ణకు అనువర్తించి ఈ కుళ్లు జోకులను రూపొందించి ప్రచారం చేస్తున్నారు.

ఈ వెబ్‌సైట్ విషయాన్ని తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. కాగా.. పోలీసులు ఈ ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్న సూత్రధారులతో పాటు సదరు వెబ్‌సైట్ నిర్వాహకులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి విజయం సాధించారు.అయితే అతన్ని ఇండియాతీసుకురావటం చాలా పెద్ద సమస్య అని తెలుస్తోంది. లీగల్ గా అక్కడే కంప్లైంట్ చేసి అరెస్టు చేసి తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు. రాజేంద్ర మహబూబ్ నగర్ కి చెందిన వ్యక్తి. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

English summary
CCS sources revealed that the creator of ihatebalayya.com has been located. His name is Attili Rajendra Reddy who is currently in Sydney, Australia. Police also reveal that Rajendra Reddy is the same man who operated the site ihatechiru.com.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu