»   » నా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు అందుకే...ఇలియానా

నా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు అందుకే...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెచ్చిపో, సలీం, శక్తి, నేనూ నా రాక్షసి అంటూ వరసగా ఫ్లాప్ లు వస్తున్నా ఇలియానాకు ఉన్న డిమాండ్ కొంచెం కూడా తగ్గలేదు. అలాగే ఆమె రెమ్యునేషన్ కూడా ఒక్క పైసా కూడా తగ్గించలేదు. ఈ విషయమై ఆమెను మీడియావారు అడిగితే...ఒకట్రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన నన్ను నేను తక్కువగా ఊహించుకోలేను. నా ఇమేజ్ నాకుంది. నేటికీ నా ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే చాలామంది చూస్తున్నారు. అలాంటప్పుడు నా పారితోషికం నేనెందుకు తగ్గించుకోవాలి. నేనెప్పుడూ స్థాయిని మించి రెమ్యునరేషన్ తీసుకోలేదు. అలాగే స్థాయిని తగ్గించుకొని కూడా తీసుకోలేను అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 'బర్ఫీ"చిత్రం చేస్తోంది.అలాగే తమిళంలో విజయ్ సరసన 'నన్బన్"లో చేస్తోంది. ఇవిగాక నాలుగైదు బాలీవుడ్ ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అందులో రెండు కన్‌ఫర్మ్ అయిపోయాయి కూడా. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా అంటోంది.

English summary
Hot and dusky actress Ileana who is doing three movies back to back has no time to rest or chill. She is too busy shuttling between foreign locales and film studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu