»   » ఐశ్వర్యను కొట్టలేదు. నా షూస్ మీద మూత్రం పోశాడు.. అతడిని లాగిపెట్టి కొట్టాను..

ఐశ్వర్యను కొట్టలేదు. నా షూస్ మీద మూత్రం పోశాడు.. అతడిని లాగిపెట్టి కొట్టాను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల నటి, ఒకప్పటి తన ప్రేయసి ఐశ్వర్యరాయ్‌ని ఎన్నడూ కొట్టలేదని, అయితే తాళ్ చిత్ర షూటింగ్‌లో దర్శకుడు సుభాష్ ఘాయ్‌ని ఒకసారి మాత్రం లాగిపెట్టి గూబపై కొట్టానని కండలవీరుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. 2002 ఆ ప్రాంతంలో సల్మాన్, ఐశ్వర్యరాయ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాను ఐశ్వర్యను పలుమార్లు కొట్టినట్టు వచ్చిన ఆరోపణలపై ఆయన సమాధానమిచ్చారు. ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతున్నది.

 ఐశ్వర్యను కొట్టలేదు

ఐశ్వర్యను కొట్టలేదు

నేను ఐశ్వర్యను ఎప్పుడూ కొట్టలేదు. నన్ను ఎవరైనా కొట్టడానికి ప్రయత్నించేవారు. షూటింగ్‌లో ఫైటర్లు గెంటేవేసే వారు. అందుకే నేనంటే జనాలకు భయం లేకపోయేది.

 సుభాష్ ఘాయ్‌ని కొట్టాను

సుభాష్ ఘాయ్‌ని కొట్టాను

కానీ ఒకసారి సుభాష్ ఘాయ్‌ని కొట్టాను. కొన్ని పరిస్థితుల వల్ల నాకు నేను హార్ట్ అయ్యాను. దాన్ని భరించలేక నా తలను గోడకేసి కొట్టుకొన్నాను. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు నేను గాయపరుచుకొనే వాడ్ని. అంతేకాని ఒకర్ని కొట్టేవాడిని కాదు. అలాంటిది సుభాష్ ఘాయ్‌ని కొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత సారీ కూడా చెప్పాను.

 నా షూస్‌పై మూత్రం పోశాడు

నా షూస్‌పై మూత్రం పోశాడు

సుభాష్ ఘాయ్ నాపట్ల దారుణంగా ప్రవర్తించారు. నా షూస్‌పై మూత్ర పోశాడు. దాంతో కొన్నిసార్లు సహనం కోల్పోయాను. ఆయన నన్ను స్ఫూన్ కొట్టాడు. చేతిలో ఉన్న ప్లేట్‌తో ముఖంపై కొట్టాడు. మెడపెట్టి నెట్టాడు. దాంతో నియంత్రణ కోల్పోయాను. ఆ పరిస్థితిలో సుభాష్‌ను నేను కొట్టాను.

 అది దారుణమైన సంఘటన

అది దారుణమైన సంఘటన

ఆ సంఘటనపై అప్పట్లో సుభాష్ మాట్లాడుతూ.. అత్యంత దారుణమైన సంఘటన. ఆ ఘటనతో షాక్‌కు గురై ఇంటికి చేరుకొన్నాను. మరుసటి రోజు ఉదయమే సల్మాన్ తండ్రి సలీం సాబ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయనంటే నాకు గౌరవం. అలాంటి వక్తి క్షమాపణ చెప్పాడు. మరో గంటలోపలే సల్మాన్‌ను పంపించి సారీ చెప్పించాడు.

సల్మాన్ చిన్నపిల్లాడిలా..

సల్మాన్ చిన్నపిల్లాడిలా..

ఇంటికి వచ్చిన సల్మాన్ నా ముందు చిన్నపిల్లాడిలా నిలుచున్నాడు. రాత్రి జరిగిన సంఘటనకు చాలా గిల్టీగా ఫీల్ అయినట్టు కనిపించాడు. దాంతో చిరునవ్వుతో పలుకరించి 'రాత్రి నీకు ఏమైంది అని అడిగాను. నా తండ్రి చెప్పినందుకే ఇక్కడికి వచ్చాను అని సల్మాన్ అన్నాడు. అయితే రాత్రి జరిగిన సంఘటనపై ఎలాంటి పశ్చత్తాపం లేదా అని అడిగా అయితే అందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను అని సల్మాన్ చెప్పాడు' అని అడిగినట్టు సుభాష్ వెల్లడించారు.

కొట్టుకొన్నాం.. ఫ్రెండ్స్ అయ్యాం

కొట్టుకొన్నాం.. ఫ్రెండ్స్ అయ్యాం

ఆ రోజు కొట్టుకొన్నాం. మళ్లీ మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఈ రోజుకు కూడా మంచి స్నేహితులం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నాకు అందరూ ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు అని సుభాష్ ఘాయ్ చెప్పారు.

ఇతర హీరోలు ఎవరూ సహాయం చేయలేదు

ఇతర హీరోలు ఎవరూ సహాయం చేయలేదు

కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది హీరోలను కలిశాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అంత గొడవ జరిగిన తర్వాత కూడా సల్మాన్ నాకు సహాయం అందించాడు. అండగా నిలిచాడు.

 సల్మాన్ సహాయాన్ని మరువను

సల్మాన్ సహాయాన్ని మరువను

నేను ఏదైనా కోరితే ప్రశ్న వేయకుండా సహాయం చేస్తాడు. నాతో పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సల్మాన్ చేసిన సహాయాన్ని ఎప్పడికీ మరువను. ఆ తర్వాత నేను తీసిన యువరాజ్ చిత్రంలో సల్మాన్ నటించారు. ఆ సినిమాలో ఆయన పక్కన అప్పటి గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ నటించింది. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది అని సుభాష్ ఘాయ్ చెప్పాడు.

English summary
Salman Khan had revealed to a leading daily that he never hit Aishwarya Rai but he did slap Subhash Ghai once.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu