చిరంజీవి నాబిడ్డ లాంటివాడు : దాసరి
చిరంజీవి నాబిడ్డ లాంటివాడు... ఆయన మీద నాకెందుకు కోపం ఉంటుందీ..? ఈ మాటలన్నది ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు. తాజాగా ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం గా ఆయన ఈ వ్యాఖ్యలు చెసారు. "నాకూ చిరంజీవికీ ఎప్పుడూ స్పర్థలు లేవు అవన్నీ మీరు సృష్టించీనవే. బిడ్డమీద తండ్రికి కోపం ఉంటుందా? అని అన్నారు....
కొందరికి తమ కుటుంబం నుంచి మాత్రమే వారసులు వచ్చారని, తనకు మాత్రం తాను పరిచయం చేసిన వారంతా వారసులని అన్న దాసరి వెంటనే మీరు చిరంజీవి గారి మీద ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదా? అని అడిగినప్పుడు కాస్త అసహనానికి లోనయ్యారు కూడా.. తనకు నిజమిన వారసుడు మాత్రం మోహన్ బాబేనని దాసరి తెలిపారు..
"భారీ బడ్జెట్ సినిమా" అంటే రెమ్యునరేషన్ లు కాదు, నిజానికి సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుమాత్రమే, హీరో, హీరోయిన్, దర్శకుడికి ఇచ్చే రెమ్యునరేషన్ పక్కన పెడితే, సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎప్పుడూ ఫిక్స్ డ్ గా ఉంటుంది, ఆ లెక్కలు అందరికీ తెలుసు." అంటూ వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు తన ఆడియన్స్ సినిమాలకు రాని కారణంగానే చిత్రాలను తీయడం తగ్గించాననీ చెప్పారు...

ఎన్నాళ్ళుగానో తాను తీయాలనుకున్న ఒక డ్రీం ప్రాజెక్ట్ "నర్తకి" చేయలేక పోయాననీ...ఇప్పుడు చేయాలనుందనీ అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసాకే ఆ విశయం ఆలో చిస్తాననీ అన్నారు...


Click it and Unblock the Notifications











