»   » ఏమీ తెలియకుండానే సినిమా తీశానని అనుకుంటున్నారా? క్రిష్ ఆవేశంగా ఇలా

ఏమీ తెలియకుండానే సినిమా తీశానని అనుకుంటున్నారా? క్రిష్ ఆవేశంగా ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చరిత్రని తెరకెక్కించతం అంటే మాటలు కాదు ఒక్కొక్క విషయం పట్లా చాలా శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. మామూలు సినిమా చేసిన దానికంటే రెట్టింపు వర్క్ చేయాల్సి ఉంటుంది... ఆ ప్రయత్నాన్ని చాలా పర్ఫెక్ట్గా చేసాడు క్రిష్ అతని కష్టం ఎంతటి ఫలితాన్నిచ్చిందో ఔట్పుట్ చెప్పేసింది.

గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన విజయం క్రిష్ పడ్డ తపనకి ప్రతిఫలం అనుకోవచ్చు... అయితే ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ మొదలయ్యింది... అసలు గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు వాడు కాదని, శాతవాహనులలో ఒకదాని, చరిత్రను వక్రీకరించాడు అని పలువురు చిత్రకారులు అంటున్నారు. కల్పితాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ, అదే చరిత్ర అంటే చూస్తూ ఊరుకోవాలా అని వారు అంటున్నారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు క్రిష్ మండిపడ్డారు. తానూ చేసిన ఓ గొప్ప ప్రయత్నాన్ని కించపరిచేలా వారు వ్యవహరిస్తున్నారని, ఇటువంటి వారి వ్యాఖ్యలపట్ల తానూ స్పందించనని అన్నారు.

 I haven't made Gautamiputra Satakarni with my eyes shut

''నన్ను నా ప్రయత్నాన్ని చిన్నబుచ్చాలని చూస్తున్న వారి విమర్శలకు నేను స్పందించను. తెలుగు చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒకడని అన్న విశ్వనాథ సత్యనారాయణ కన్నా ఎక్కువ తెలుసా వారికి? పరబ్రహ్మ శాస్త్రిది తప్పుడు వాదన అని వారు చెప్పగలరా? నందమూరి తారకరామారావు కూడా ఆ సినిమా చేయాలని తలపోశారు.

నిజంగా తెలుగు వాడు కాకపోతే.. ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలని అనుకునేవారా? ఏమీ తెలియకుండానే సినిమా తీశానని అనుకుంటున్నారా? నేను మరీ అంత సోమరిని కాదు. కళ్లు మూసుకుని సినిమా తీయలేదు. స్క్రిప్ట్ రాసేటప్పుడు 5 పుస్తకాలను చదివాను. వాటిలో 10 రకాలుగా శాతకర్ణి గురించి చెప్పుకొచ్చారు.

ఆ పది వర్షన్లన్నింటినీ కలిపి, తాను స్కూలు డేస్ నుంచి శాతకర్ణి గురించి చదువుకున్న దాన్నంతా మిళితం చేసి సినిమా తీశాను. మీరంటున్న ఫిక్షన్‌లో అన్ని నిజాలనే ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించాను. నన్ను విమర్శించేవాళ్లవన్నీ నిరాధార ఆరోపణలే'' అంటూ కాస్త ఆవేసంగానే బదులిచ్చాడు క్రిష్.

English summary
"I haven't made GPSK with my eyes shut. I had read 5 books while preparing the script. There were 10 versions of Satakarni in them. I had blended all of them to make this movie and tried my best to present the truth. All those allegations were baseless, told Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu