»   » బూతు హీరోయిన్ ఇమేజ్ పోవడానికి...రక్తం కారేలా కష్టపడింది!

బూతు హీరోయిన్ ఇమేజ్ పోవడానికి...రక్తం కారేలా కష్టపడింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సన్నీ లియోన్ పేరు చెప్పగా అందరికీ ముందుగా గుర్తొచ్చేవి బూతులు సినిమాలే. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితం అయిన బూతు సినిమాల(పోర్న్) ప్రపంచంలో అగ్రతారగా తారా స్థాయికి ఎదిగిన సన్నీ లియోన్....ఆ సినిమా ప్రపంచాన్ని వదిలేసి సాధారణ సినిమాల ప్రపంచంలో అడుగు పెట్టింది. జిస్మ్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్టీ ఇచ్చింది. సాధారణ సినిమాల్లో నటిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది.

అయితే తొలి సినిమా 'జిస్మ్ 2' విడుదల తర్వాత చాలా మంది ఆమెకు నటన రాదనే విమర్శలు చేసారు. ఆ తర్వాత ఆమె 'జాక్ పాట్' సినిమాలో నటించినా తాను ఆశించిన పేరు మాత్రం రాలేదు. ప్రస్తుతం సన్నీ లియోన్ నటించిన 'రాగిణి ఎంఎంస్ 2' చిత్రం విడుదలైంది.

I hope people change mindsets about my acting, says Sunny Leone

ఈచిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సన్నీ లియోన్ తెగ సంబర పడిపోతోంది. ముంబైలో ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్లో ప్రేక్షకులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నా నటనపై విమర్శలు చేసే వారిని, నా గురించి చెడ్డగా మాట్లాడే వారి నోరు మూయించగలనో లేదో నాకు తెలియదు, కానీ ఈ చిత్రం చూసిన తర్వాత నా నాటన గురించి వాళ్లు ఆలోచన మార్చుకుంటారేమో అని సన్నీ లియోన్ వ్యాఖ్యానించింది.

గతంలో కంటే తాను నటనలో తను మెరుగు పడ్డానని, ఈ చిత్రం కోసం చాలా కష్ట పడ్డానని, క్లైమాక్స్ సన్నివేశం సినిమా షూటింగ్ సమయంలో గాయాలయి రక్తం కూడా కారిందని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు. ఈచిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

English summary
Indo-Canadian adult film actor Sunny Leone, whose latest Bollywood project "Ragini MMS 2" has hit the screens, hopes that her performance in the movie will help people change their mindsets about her acting skill.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu