»   » నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను ...జూ ఎన్టీఆర్

నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను ...జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"బృందావనం" టాక్ బాగుండటంతో ఎన్టీఆర్ ఆనందానికి హద్దే లేకుండాపోయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆయన తన అభిమానులకు ధాంక్స్ చెప్పుకున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ...నేనిప్పటీ నమ్మలేకున్నాను...ప్రతీ ఒక్కరకీ ధాంక్స్..నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నారు. ఇక రిలీజ్ కు ముందు ఆయన చాలా నెర్వెస్ గా ఫీలవతున్నట్లు ట్వీట్ చేసారు. అలాగే మీ ప్రేమకీ,సపోర్టుకీ చాలా సంతోషం. సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. ఇదంతా టీమ్ వర్క్..అలాగే ఈ రోజు కొన్ని ఇంటర్వలు ఇవ్వాలి. ఆ తర్వాత శక్తి షూటింగ్..రేపు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పారు. ఇక నిన్న(గురువారం) ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో విడుదలైన బృందావనం చిత్రం రొటీన్ కథే అనిపించినా నెగిటివ్ టాక్ మాత్రం స్ప్రెడ్ కాలేదు. ఖలేజా, పులి లతో ఈ చిత్రాన్ని పోల్చి బాగుందనే అంటున్నారు. అయితే రోబో రేంజి మాత్రం ఈ చిత్రానికి లేదని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu