twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లంచంపై పోలీసులకు అమీర్ ఖాన్, సెన్సార్ ఆఫీసర్ అరెస్ట్

    By Bojja Kumar
    |

    ముంబై: లంచం అడిగితే ఎంతటి వారిపైన అయినా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేసారు. సినిమా సెన్సార్ సందర్భంగా తాను ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వ లేదని తెలిపారు. ఇటీవల సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డ్ సీఈఓ రాకేష్ కుమార్ లంచం తీసుకుంటూ అరెస్టయిన నేపథ్యంలో అమీర్ ఖాన్ పై విధంగా స్పందించారు.

    ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ప్రాంతీయ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి రూ. 70 వేల లంచం అడిగారనే ఆరోపణలతో రాకేష్ కుమార్ ఇటీవల అరెస్టు అయ్యారు. అయితే రాకేష్ కుమార్ లంచం వ్యవహారంపై స్పందించడానికి అమీర్ ఖాన్ నిరాకరించారు. తన వద్ద అతను ఎప్పుడూ లంచం అడగలేదని, అందుకే ఈ విషయమై తాను స్పందించబోనని అమీర్ ఖాన్ స్పష్టం చేసారు.

    I’ll immediately call the police: Aamir Khan

    అమీర్ ఖాన్ తాజా సినిమా 'పి.కె' విషయానికొస్తే....
    అమీర్ ఖాన్ తాజా సినిమా 'పి.కె'కు సంబంధించి ఇటీవల విడుదలైన న్యూడ్ లుక్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కేసు కూడా బుక్ అయింది. దీనిపై అమీర్ ఖాన్ మాట్లాడుతూ...తాను పబ్లిసిటీ కోసం అలా చేయలేదని, సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు. ఆగస్టు 20న విడుదలయ్యే పోస్టర్లో రేడియో కూడా అడ్డం ఉండదని చెప్పిన అమీర్ ఖాన్...సెకండ్ పోస్టర్లో నిండుగా బట్టలేసుకుని దర్శనమిచ్చాడు.

    రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    English summary
    
 Bollywood superstar Aamir Khan has never experienced bribery for film certification. He says he doesnt support palm-greasing and in case he comes across it, he will immediately inform the police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X