»   » అన్నయ్య జోలికొస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా : నాగబాబు

అన్నయ్య జోలికొస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా : నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఖైదీ నెం 150' సినిమా విడుదల ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు యండమూరి వీరేంద్రనాథ్, రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగబాబు ఆ ఇద్దరినీ తిడుతూ మాట్లాడటం అందరినీ ఆశ్చర్య పరిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు అపుడు తాను అలా స్పందించడానికి గల కారణాలను వివరించారు. 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత నాగబాబు ఈ మ్యాటర్ మీద స్పందించడం ఇదే తొలిసారి.

యండమూరి కుసంస్కారి అంటూ విమర్శించిన నాగబాబు... ఇప్పటికీ ఆయన్ను తన గురువుగా భావిస్తానని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.

 యండమూరిని అపుడు అలా తిట్టడంపై

యండమూరిని అపుడు అలా తిట్టడంపై

చరణ్ గురించి మాట్లాడే సమయంలో యండమూరి వాడు వీడు అనే పదాలు వాడాడు. ఒకవేళ రామ్ చరణ్ తో అఫెక్షన్ ఉంటే అలా అనడంలో తప్పులేదు. కానీ చరణ్ ను తక్కువ చేసిన మాట్లాడటం నేను తట్టుకోలేక పోయాను. యండమూరితో నాకు ఎలాంటి శతృత్వం లేదు. ఇప్పటికీ ఆయన్ను గురువుగారిగా భావిస్తాను, ఎంతో గౌరవం ఇస్తాను. ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది. నా గురించి యండమూరికి బాగా తెలుసు. నా కామెంట్స్ ఆయన సీరియస్ గా తీసుకుంటారని అనుకోవడం లేదు అని నాగబాబు అన్నారు.

 అన్నయ్య జోలికొస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా

అన్నయ్య జోలికొస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా

ఎవరైనా అన్నయ్యను గానీ, మా ఫ్యామిలీని గానీ టార్గెట్ చేస్తే నేను మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాను. అదే సమయంలో నాపై విమర్శలు వచ్చినా పట్టించుకోను... అని నాగబాబు చెప్పుకొచ్చారు.

 వర్మ హర్ట్ అయ్యాడు

వర్మ హర్ట్ అయ్యాడు

నేను చేసిన కామెంట్స్ వల్ల రామ్ గోపాల్ వర్మ హర్టయ్యాడు. అందుకే ఆయన అదే రీతిలో స్పందించారు. నేను అన్నయ్య చిరంజీవిలో 0.01% కూడా కాదు అని వర్మ అన్నారు. నేనైతే అన్నయ్య ముందు జీరో అనే ఫీలవుతాను. అన్నయ్య మీద ఆధారపడి ఉండటం నాకు సంతోషకరమైన విషమే అని నాగబాబు తెలిపారు.

 ఆ ఫెయిల్యూర్ బాధ్యత నాదే

ఆ ఫెయిల్యూర్ బాధ్యత నాదే

పీఆర్పీ ఫెయిల్యూర్ కు నాదే బాధ్యత అని రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. నిజమే ఆ ఫెయిల్యూర్ బాధ్యత నాది కూడా. ఎందుకంటే అన్నయ్యకు సలహాలు ఇచ్చిన వారిలో నేను కూడా ఉన్నాను అని నాగబాబు అన్నారు.

 ఎలాంటి సలహాలు ఇవ్వను

ఎలాంటి సలహాలు ఇవ్వను

కొన్ని సార్లు రామ్ గోపాల్ వర్మ చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తాడు. నా నుండి ఎలాంటి సలహాలు తీసుకోవద్దని వరుణ్ తేజ్ కు సూచించాడు. వాస్తవానికి నేను వరుణ్ కు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వను. కానీ ఏదైనా విషయం గురించి నాతో చర్చిస్తే నా ఒపీనియన్ చెబుతాను. ఆర్జీవీ చాలా ఫన్నీ పర్సన్. ఆయన కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తాను అని నాగబాబు అన్నారు.

 అందుకే అలా మాట్లాడా

అందుకే అలా మాట్లాడా

వర్మ గురించి అలా మాట్లాడటానికి కారణం... గత ఐదేళ్లుగా వర్మ మెగా ఫ్యామిలీపై రాళ్లేస్తున్నాడు. అన్నయ్య 150వ సినిమా గురించి విమర్శలు చేసారు. అందుకే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. కేవలం అతడిలో మార్పు రావాలనే అలా మాట్లాడాను. అంతే కానీ అతన్ని హర్ట్ చేయాలని కాదు. ఇప్పటికీ వర్మ ఎదురు పడితే ఫ్రెండ్లీగా మాట్లాడతాను అని నాగ బాబు తెలిపారు.

English summary
"I lose my mental balance if someone targets Annayya or My Family Members. At the same time, I don't care a damn even if I was criticized. My comments seems to have hurt RGV very much and hence he reacted that way." Naga Babu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu