»   » పవన్ కళ్యాణ్‌‌పై ఇష్టంతో, హీరోయిన్ ఓపెన్‌గా..

పవన్ కళ్యాణ్‌‌పై ఇష్టంతో, హీరోయిన్ ఓపెన్‌గా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన్ను అభిమానించే వారిలో సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు...పలువురు సినీ స్టార్స్ సైతం ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ నిత్యా మీనన్ కూడా చేరి పోయారు. పవన్ గురించి తన మనసులోని భావాలను ఓపెన్ గా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడుతూ....‘నేను ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు హీరో గురించి పెద్దగా పట్టించుకోను. కథకే ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే నేను ఇష్టపడే వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. అతని స్టైల్, యాక్టింద్ అంటే చాలా ఇష్టం. ఆయన గురించి చాలా గొప్ప విషయాలు విన్నాను. అప్పటి నుండి ఆయన నా ఫేవరెట్ హీరో అయిపోయారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

I love Pawan Kalyan: Nithya Menon

నిత్యామీనన్ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యపరుస్తూ...అందరినీ థ్రిల్ చేస్తూంటాయి. ఆమె మంచి టాలెంటెడ్ నటి అన్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో సోదరిగా చేస్తోంది. ఈ విషయమై మీడియాలో విభిన్న కథనాలు రావటంతో ఆమె స్పందించింది.

"బన్నికు సోదరిగా నటిస్తే ప్లాబ్లం ఏంటి..కాజల్, షారూఖ్ ఖాన్ జోష్ చిత్రంలో అన్న చెల్లెళ్లు గా చేసారు. తర్వాత వాళ్ళిద్దరూ దేవదాసులో లవర్స్ గా చేసారు. అల్లు అర్జున్ నాకు తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గ ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేసాడు " అంటూ నిత్యా మీనన్ వివరించింది.

English summary
“I don’t have any personal preferences when it comes to my hero. But I love Pawan Kalyan. I like his style of acting and I have heard a lot about him. Since then, he is my favourite hero,” says Nithya Menon.
Please Wait while comments are loading...