»   » వయసెక్కువ మగాళ్లకే కనెక్టుఅవుతా: ఇలియానా

వయసెక్కువ మగాళ్లకే కనెక్టుఅవుతా: ఇలియానా

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రీసెంట్ గా బాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ఇలియానా తన మనస్సులో భావాలను అక్కడ మీడియాతో పంచుకుంటోంది. తాజాగా ఓ బాలీవుడ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ.. తాను వయసెక్కువ మగవాళ్ల పట్ల తను ఎట్రాక్ట్ అవుతుంటానని ఈ గోవా బ్యూటీ తేల్చి చెప్పింది. ఆమె మాట్లాడుతూ... "కొంచెం వయసెక్కువ మగవాళ్లతో నేను కనెక్టవుతుంటాను. దీనికి కారణం నేనున్న వృత్తి వల్లేనని నా అభిప్రాయం'' అంది.

  అలా ఎట్రాక్ట్ అవటానికి కారణం చెప్తూ... "సినీ రంగంలోని ఆడవాళ్లు చిన్న వయసులోనే బాగా ఎక్స్ పోజ్ అవుతుంటారు. అందువల్ల చాలా వేగంగా వారు పరిణతి చెందుతారు. మా అమ్మానాన్నల మధ్య వయసు తేడా పన్నెండేళ్లు. అలాగే మా అక్కా బావల మధ్య వయసు తారతమ్యం పదేళ్లు. ప్రేమలో పడ్డాక, వయసనేది పెద్ద విషయం కాదు'' అని చెప్పింది ఇలియానా.

  అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించిన 'జులాయి', రవితేజతో చేసిన 'దేవుడు చేసిన మనుషులు' రెండూ తెలుగులో విడుదల అయ్యి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. జూలాయి హిట్టైన దేముడు చేసిన మనుష్యులు చీదేసింది. ఈ విషయమై చెప్తూ... నా సినిమా విడుదల అవుతోందంటే నాకు ఒకటే కంగారు. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తారో లేదో.. అనే భయం ఉంటుంది. గాల్లో దీపం పెట్టి 'దేవుడా నువ్వే దిక్కు' అంటే ఉపయోగం ఏముంది? మేం చేసిన ప్రయత్నంలో నిజాయతీ ఉంటే తప్పకుండా ఫలితం ఉంటుందని నమ్ముతాను అంది.

  అలాగే తన మత విశ్వాసాలు గురించి చెపుతూ.. నేను క్రిస్టియన్‌ని అయినప్పటికీ హిందూ దేవాలయాలకు వెళతాను. మాస్క్‌లకు కూడా వెళుతుంటాను. మనకన్నా పైన ఎవరో ఉన్నారని, ఆ శక్తే మనల్ని నడిపిస్తోందని నమ్ముతాను.. అన్ని మతాల సారం ఒక్కటే అన్నది నా సిద్ధాంతం. దేవుళ్లందరినీ నమ్ముకొంటే కనీసం ఒక్క దేవుడైనా కరుణిస్తాడని నా ఆశ.. అని చెప్పింది.

  English summary
  "I tend to connect with men who are a little older. I am attracted to older men. I also guess it’s because of the profession I am in. The women in our profession are exposed to a lot more at a young age, so they mature faster. The age gap between my parents is 12 years. The age gap between my sister and her husband is 10. When you fall in love, age shouldn’t really matter" says Ileana.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more