For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను బ్రాండెడ్‌ గజినీని: రాజమౌళి

  By Srikanya
  |

  హైదరాబాద్‌:నాని పాత్రలో నేను జీవిస్తున్నాను...నేను బ్రాండెడ్ గజనీని అంటున్నారు రాజమౌళి. నాని, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం... భలే భలే మగాడివోయ్‌. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అందులో నాని మతిమరుపు వ్యక్తి పాత్ర పోషిస్తున్నాడు.

  ఈ చిత్రం ట్రైలర్‌ చాలా బాగుందని, ట్రైలర్‌ అంటే అచ్చం ఇలాగే ఉండాలని ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ దర్శకులు రాజమౌళి. అంతే కాదు, చిత్రంలో నాని పాత్రను తాను నిజజీవితంలో జీవిస్తున్నానని, కుటుంబంలో తాను బ్రాండెడ్‌ గజినీనని రాజమౌళి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

  ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ట్రైలర్‌ను సైతం మంచి ఆదరణ పొందుతోంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని, క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రాలకు తీసిపోకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, డాల్బీ అట్మాస్ సిస్టమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.

  I'm a branded Gajani :Dialogue Trailer

  నటించడానికి వీలున్న ఓ మంచి పాత్ర ఈ సినిమాలో దొరికిందని, నిర్మాత సినిమాను క్వాలిటీగా రూపొందించారని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్‌కు వెళ్లి, చూసి నవ్వినవ్వి రావచ్చనినాని తెలిపారు.

  కెమెరా పనితనం సరికొత్తగా వుందని, ఈ చిత్రంలో ప్రతి పాత్ర నవ్విస్తూనే వుంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు మారుతి తెలిపారు.

  మతిమరుపు కుర్రాడిగా నాని నటించిన పాత్ర సరికొత్తగా ఉంటుందని, పూర్తి కమర్షియల్ విలువలతో ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా వచ్చేనెల 4న థియేటర్లలో విడుదలవుతుందని నిర్మాత బన్నీవాసు తెలిపారు.

  ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యువతనూ అలరిస్తుందని హీరో నాని హామీ ఇస్తున్నాడు. సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో నాని చిన్నపాటి ప్రమాదానికి గురైనా... వెంటనే షూటింగ్ లో పాల్గొని ఎంతో సహకరించాడని డైరెక్టర్ మారుతీ కితాబిచ్చాడు.

  'ఈ రోజుల్లో', 'బస్టాప్'తో అడాల్ట్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ 'కొత్త జంట'తో ఆ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేశాడు కానీ, పెద్దంత సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రం అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'భలే భలే మొగాడివోయ్' ను అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ గా మారుతీ తెరకెక్కిస్తున్నాడట.

  విశేషం ఏమంటే... ఇంతవరకూ తన సినిమాలకు జెబితోనే మ్యూజిక్ చేయించుకున్న మారుతీ ఇప్పుడు మలయాళంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో గోపీ సుందర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 'అందాలరాక్షసి', 'దూసుకెళ్తా' చిత్రాల్లో నటించిన అయోధ్య చిన్నది లావణ్య త్రిపాఠి సైతం మంచి విజయం కోసం ఎదురు చూస్తోంది!

  మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

  English summary
  Rajamouli tweeted: nani reminds me so much of myself. I am a branded ghajini in my family…:). Bhale Bhale Magadivoi Telugu movie Latest Trailer featuring Nani, Lavanya Tripathi. Bhale Bhale Magadivoy movie music is composed by Gopi Sunder exclusively on UV Creations. Directed by Maruthi Dasari and produced by Bunny Vas under the banner GA2 Pictures and UV Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X