»   »  ఫ్లాఫే..ఏం చేస్తాం, హిట్ అవుతుందనే అనుకున్నా అంటున్న సమంత

ఫ్లాఫే..ఏం చేస్తాం, హిట్ అవుతుందనే అనుకున్నా అంటున్న సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తాము చేసిన ఏ సినిమా అయినా ఫెయిల్ అయితే ఆర్టిస్ట్ లుకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ కన్నా ఎక్కువగా ఫెయిల్యూర్ చాలా స్పీడుగా కెరీర్ పై ప్రభావం చూపిస్తుంది. సెటిలై స్టార్ డమ్ తెచ్చుకున్న ఆర్టిస్ట్ లుకు అంతగా ఎఫెక్ట్ చూపకపోయినా బాధ మాత్రం అదే స్దాయిలో ఉంటుంది. అదే విషయం స్టార్‌ హీరోయిన్‌ తన మాటల్లో సమంత స్పష్టం చేసింది.

తాజాగా సమంత నటించిన బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ విషయమై మీడియా వారు ఆమె వద్ద ప్రస్దావించినప్పుడు బాధగానే స్పందించింది. ఆమె మాట్లాడుతూ తాను బాధపడ్డానని చెప్పుకొచ్చారు.

సమంత మాట్లాడుతూ..'బ్రహ్మోత్సవం' ఫలితం విషయంలో బాధపడిన సంగతి నిజమే. చిత్రాలు తీయడం వరకే మా బాధ్యత.. తర్వాత మా చేతిలో ఏం ఉండదు. ప్రేక్షకులే జయాపజయాలను నిర్ణయిస్తారు అని అన్నారామె.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరో గా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం 'అ ఆ' (అనసూయ రామలింగం, ఆనంద్ విహరి). ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత చిత్ర విశేషాలను తెలిపారు. అవన్నీ స్లైడ్ షోలో చదవండి.

బాధకూడా పడతాను

బాధకూడా పడతాను

హిట్ వచ్చినపుడు ఎంత సంతోషపడతానో, ఫ్లాప్ వచ్చినపుడు కూడా అంతే బాధపడతాను. జయాపజయాలను ఎలా తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లోనే వుంటుంది. ఈ వేసవికి విడుదలైన నా సినిమాలు తేరి, 24 మంచి విజయాలు అందుకున్నాయి. బ్రహ్మోత్సవం మాత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

 పెళ్లి ఇప్పుడేనా..

పెళ్లి ఇప్పుడేనా..

పెళ్లి గురించి నేనేం చెప్పలేదు. ఇప్పటికే ఈ విషయంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవి అందరూ ఊహించేసుకుని రాస్తున్నారు. చదివినవారు నిజమనుకుంటున్నారు. అంతే!

పెళ్లి కొడుకు ఎవరనేది..

పెళ్లి కొడుకు ఎవరనేది..


చెప్తా చెప్తా... ప్రత్యేకంగా ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతా.

తెగ రాసేస్తున్నారు

తెగ రాసేస్తున్నారు

అయితే ఈలోగా చాలా వూహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి ఫుల్‌స్టాప్‌ ఎలా పెట్టాలో అర్దం కావటం లేదు. పెళ్లి చేసుకొంటా అన్న మాట అన్నానో లేదో? సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటోంది? అంటూ తెగ రాసేస్తున్నారు.

భయం వేస్తోంది

భయం వేస్తోంది

పొద్దుటే పేపర్‌ చూడాలంటే భయం వేస్తోంది. ‘ఈరోజు నా గురించి ఏం రాశారో...' అన్న టెన్షన్‌. నేనొకటి చెప్తే వాళ్లకు నచ్చిందేదో రాసుకొంటున్నారు.

 పెళ్లి చేసుకున్నా సరే..

పెళ్లి చేసుకున్నా సరే..

త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పా తర్వాత నటిస్తారా అంటే...పెళ్లి అయినా సరే సినిమాలు చేస్తాను

త్రివిక్రమ్‌ అనేనా..లేక...

త్రివిక్రమ్‌ అనేనా..లేక...

అక్కడితో ఆగిపోండి. ఎందుకంటే నేనెప్పుడూ కథ, నా పాత్ర తప్ప మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోను. ఇప్పటి వరకూ చేసిన ప్రతి సినిమా కథ నచ్చిన తరవాతే సంతకం చేశా. ఇదీ అంతే.

ఆయనతోనే మళ్లీ మళ్లీ

ఆయనతోనే మళ్లీ మళ్లీ

కానీ త్రివిక్రమ్‌తో నే కాదండీ. గౌతమ్‌ మేనన్‌, విక్రమ్‌ కె.కుమార్‌లతోనూ నేను మళ్లీ మళ్లీ పనిచేశా. నేను ఎవరికి బాగా ట్యూన్‌ అవుతానో వాళ్లతో పనిచేయడం నాకు సులభంగా ఉంటుంది.

గుర్తు చేసేవారు

గుర్తు చేసేవారు

త్రివిక్రమ్‌ గారికి నేనేంటో బాగా తెలుసు. నా సినిమాలన్నీ చూశారాయన. ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తే... ‘ఫలానా సినిమాలో ఇలానే చేశావ్‌..' అంటూ గుర్తు చేసేవారు. అందుకే అనసూయగా ఓ సరికొత్త సమంతని తెరపై చూసుకొనే అవకాశం వచ్చింది.

బాధ వేస్తుంది

బాధ వేస్తుంది

చాలా మంది పేదవారు గుండె జబ్బులతో ట్రీట్ మెంట్ చేసుకునే ఆర్దిక స్దోమత లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివాళ్లను చూస్తూంటే బాధేస్తుంది.

అందుకే...

అందుకే...

మా వంతుగా..కొంతమందికైనా సహాయం అందించేందుకు మా ప్రత్యూష ఫౌండేషన్ తరుపున జూలైలో అమెరికా కు వెళ్లి అక్కడ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్ణహించబోతున్నాం అన్నారు.

కామెడీ ట్రై చేయలేదు

కామెడీ ట్రై చేయలేదు

‘నేను ఇప్పటివరకూ సీరియస్, ఇంటెన్స్, రొమాన్స్ లాంటి అన్ని రకాల జోనర్స్ సినిమాలలో నటించాను. కానీ కామెడీ మాత్రం ట్రై చేయలేదు. మొదటిసారి ‘అ ఆ' చిత్రంలో కామెడీ పాత్రలో నటించే ప్రయత్నం చేశాను.

త్రివిక్రమ్ కు ధాంక్స్

త్రివిక్రమ్ కు ధాంక్స్

నాకు మొదటినుండి కమెడియన్స్ అంటే చాలా ఇష్టం. కామెడీ పండించడం చాలా కష్టమైన పని. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు థాంక్స్' అని నటి సమంత పేర్కొన్నారు.

 నా క్యారక్టరైజేషన్

నా క్యారక్టరైజేషన్


ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా జీవితానికి దగ్గరగా వుంటుంది. చాలా అల్లరి చేస్తూ త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ వుంటుంది. ఈ వేసవిలో ఇదే నా చివరి చిత్రం. ఇది నా కెరీర్‌కు చాలా ముఖ్యమైనది.

కష్టపడలేదు,ఇమిటేట్ చేసా

కష్టపడలేదు,ఇమిటేట్ చేసా


కామెడీ జోనర్‌లో నటించడానికి ఎటువంటి కష్టం నేను పడలేదు. త్రివిక్రమ్‌కు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఈ సినిమాలో నేను ఎక్కువగా ఆయననే ఇమిటేట్ చేశాను.

కొత్తదేమీ కాదు కానీ

కొత్తదేమీ కాదు కానీ

‘అ ఆ' ఓ కొత్త కాన్సప్ట్ అని చెప్పనుగానీ, సినిమా మొదటినుండీ చివరివరకూ ప్రతి ఒక్కరూ నవ్వుతూనే వుంటారని మాత్రం చెప్పగలను. ఫస్ట్‌కాపీ చూసిన తరువాత మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వుంది.

గమనిస్తే అర్దమవుతుంది

గమనిస్తే అర్దమవుతుంది

ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకుడని ఒప్పుకోలేదు. మొదటినుండీ నేను చేసిన సినిమాలు గమనించి వుంటే అర్థమవుతుంది. కథ నచ్చితేనే తప్ప ఎవరి గురించో నేను సినిమాలు చేయను. మొదట కథ విన్న తరువాత అది నన్ను ప్రోత్సహించేలా వుంటే ఆ సినిమా తప్పక చేస్తాను.

నా పాత్రే కీలకం కాదు

నా పాత్రే కీలకం కాదు


ఈమధ్యకాలంలో హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యం వున్న సినిమాలే వస్తున్నాయి. పది సినిమాల్లో ఒక్క సినిమాకు మాత్రమే హీరోయిన్‌కు మంచి పాత్ర వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో నాకు అ ఆ లాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్‌లిద్దరికీ సమానమైన ప్రాధాన్యత వుంటుంది.

బంధాలను సైతం

బంధాలను సైతం

ప్రేమకథను మాత్రమే కాక కుటుంబంలోని బంధాలను ఎక్కువగా చూపించే ప్రయత్నాలు చేశారు.

నిజం కాదు

నిజం కాదు


చేసిన దర్శకులతోనే, హీరోలతోనే మళ్లీ మళ్లీ పనిచేయడంలో నేను కంఫర్ట్‌బుల్‌గా వుంటాను. చాలామంది అదే హీరోలతో అదే దర్శకులతో చేస్తున్నారని విమర్శిస్తున్నమాట నిజమే. కానీ అది నిజం కాదు.

స్నేహమే

స్నేహమే

త్రివిక్రమ్, నితిన్‌లతో మంచి స్నేహం వుంది. ఈ సినిమాలో ఎలాంటి భేషజాలు లేకుండా నటించాను అంటే వాళ్ళిద్దరితో వున్న స్నేహిమే ప్రధానమైంది.

తప్పుచేసానని..

తప్పుచేసానని..

నితిన్‌తో నటించడం ఎలా వుందంటే, అతను నాకో మంచి ఫ్రెండ్. సినిమా మొదలైన రెండు రోజుల షూటింగ్‌లో మా ఇద్దరిమధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. వీరిద్దర్నీ ఎంపిక చేసుకొని తప్పుచేశానని త్రివిక్రమ్ కూడా అనుకున్నారు. కానీ ఆ తరువాత మెచ్చుకున్నారు.

నెక్ట్స్

నెక్ట్స్

ప్రస్తుతం ‘యూ టర్న్' అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నాను. పవన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘జనతాగ్యారేజ్' చిత్రంలో కూడా ప్రస్తుతం నటిస్తున్నాను.

అల్లరి పిల్లనే

అల్లరి పిల్లనే

'అనసూయ పాత్ర చాలా నచ్చింది. ఈ పాత్రలో నేను చాలా అల్లరి చేస్తూ కనిపిస్తాను. నిజ జీవితంలోనూ నేను అల్లరి పిల్లనే. 'అ..ఆ' హీరోయిన్ కు ప్రాధాన్యమున్న సినిమా అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఇది గొప్ప కథేమీ కాదు.. కానీ త్రివిక్రమ్‌ ఎమోషన్స్‌ని చాలా చక్కగా చూపించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యమిస్తూ.. తెరకెక్కించిన చిత్రమిది.

    English summary
    Actress Samantha is disappointed with her recent debacle Brahmotsavam.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu