»   » ర్యాట్ రేస్ హీరోలకు పంచ్ ఇచ్చిన....అల్లు శిరీష్!

ర్యాట్ రేస్ హీరోలకు పంచ్ ఇచ్చిన....అల్లు శిరీష్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడు అల్లు శిరీష్ త్వరలో 'గౌరవం' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాక ముందు నుంచే అల్లు శిరీష్ నిర్మాత తనయుడిగా, కొంత కాలం పాటు సినీ మేగజైన్ నడిపిన వ్యక్తిగా, మెగాఫ్యామిలీకి చెందిన మనిషిగా గుర్తింపు పొంది సెలబ్రిటీల లిస్టులో చేరిపోయాడు.

  సోషల్ నెట్వర్కింగ్ సైట్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ....తరచూ ఆసక్తిర, తలబిరుసు కామెంట్స్ చేసే అల్లు శిరీష్ మరోసారి అలాంటి వ్యాఖ్యాలే చేసాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'మా అన్నయ్య అల్లు అర్జున్ తొలి సినిమా నుండి చాలా కష్ట పడుతున్నాడు. పరిశ్రమలో తన స్థానం పదిలపరుచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. మా కజిన్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదు, నేను ఈ ర్యాట్ రేస్‍‌లో లేను, నేను డిఫరెంట్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను' అంటూ వ్యాఖ్యానించాడు.

  అల్లు శిరీష్ 'గౌరవం' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాధా మోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషల్ డ్రామా... హ్యూమన్ టచ్ తో కూడి ఉంటుంది. ఓ సిటీ కుర్రాడు... తన స్నేహితుడుని వెతుక్కుంటూ ఓ విలేజ్ కు వెళ్లతాడు. అక్కడ అసలు భారతీయ గ్రామం స్వరూపం చూడటం జరుగుతుంది. అక్కడ జరిగే పరిణామాల సమాహారమే గౌరవం చిత్రం. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

  English summary
  “When my brother Allu Arjun made his debut, he was in a rat race and he had to solidify his position in the industry. My cousin, Ram Charan had no choice other than living up to the expectations of being Chiranjeevi’s son. I don’t have any of these pressures and I’m not in a rat race. I just want to do different stuff and learn along the way,” Allu Sirish told.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more