»   » ఐటం సాంగ్ విషయమై మంచు లక్ష్మి వివరణ

ఐటం సాంగ్ విషయమై మంచు లక్ష్మి వివరణ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రసన్న ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కడలి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆమె ఈ చిత్రంలో ఓ హాట్ ఐటం నెంబర్ చేయబోతోందంటూ వార్తలు వచ్చాయి. మీడియాలో ఈ వార్తకు విషేష ప్రాచుర్యం లభించింది. ఈ నేఫధ్యంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ...అవన్నీ కేవలం రూమర్స్ అని,తాను ఏ ఐటం నెంబర్ చేయటం లేదని తెలియచేసింది. ఈ చిత్రంలో ఆమె ఓ గ్రామీణ యువతిగా,నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తోందని తెలిసింది.

  'విలన్‌' చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాల చిత్రం 'కడలి‌'. ఇందులో కార్తి కుమారుడు గౌతం, రాధ రెండో కుమార్తె తులసి జంటగా నటిస్తున్నారు. అరవింద్‌స్వామి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. జాలర్ల జీవిత నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.కడల్‌' చిత్ర కథ ప్రకారం క్లైమాక్స్ లో తుపాను సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియను కొన్ని రోజుల క్రితం ప్రారంభించారు. ఇంతలో వచ్చిన 'నీలం' తుపానును తన సినిమాకు వినియోగించుకున్నారు మణిరత్నం. సముద్రతీరంలో సుమారు గంటపాటు కీలకఘట్టాలను చిత్రీకరించినట్లు సమాచారం.

  సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది.

  మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

  English summary
  It's been strongly buzzed that Nandi-award winning actress Lakshmi Manchu will be seen in an item song in Mani Ratnam's Kadal (Kadali in Telugu). However, when contacted Manchu Lakshmi, she slammed all reports saying that all these are rumors and that's she's not doing an item number. Lakshmi is reportedly playing a village belle portraying a dark role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more