For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోతో ఎంగేజ్ మెంట్ మ్యాటర్ పై త్రిష వివరణ

  By Srikanya
  |

  హైదరాబాద్: దగ్గుపాటి రాణాతో తనకు ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ వచ్చిన వార్తలను త్రిష ఖండించింది. ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...ఇదంటా బేస్ లెస్ గా రాస్తున్న రూమర్స్. రాణా, నేను చాలా బెస్ట్ ప్రెండ్స్ మి అంతే. అలాంటి స్నేహితులైన మా మధ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయటం ఏమీ పద్దతిగా లేదు. అసలు జరగని ఎంగజ్ మెంట్ గురించి నన్ను ప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది. నేను మూడు తమిళ సినిమాల్లో చేస్తున్నాను. పెళ్లి గురించి ఆలోచించే తీరికే లేనప్పుడు ఇంకా ఎంగేజ్ మెంట్ గురించి ఏమి చెప్పను అందామె.

  ఇక గత కొద్ది రోజులుగా రాణా,త్రిష ప్రేమలో ఉన్నారని, వారి ప్రేమ పెళ్లి కి దారి తీసిందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు త్రిష కి ట్విట్టర్ లో రాణా విషెష్ చెప్పటం,మాట్లాడుకోవటం అందరిలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేగాక వీరిద్దరూ ఓ పంక్షన్ కి ఆ మధ్యన కలిసి వెళ్ళటం కూడా ఈ రూమర్స్ కి ఆధారం ఇచ్చినట్లైంది. అయితే ఎప్పట్లాగే ఈ విషయమై త్రిష ఖండన చేసింది. అయితే ఈ రూమర్స్ ని రాణాకి చెందిన వారే పుట్టిస్తున్నారని, అతనికి మార్కెట్ల్లో ఎలాగూ క్రేజ్ లేదు కాబట్టి ఇలాగైనా క్రేజ్ తెద్దామనే స్టాటజీ అని చెప్పుకుంటున్నారు.

  ప్రస్తుతం రాణా.. కృష్ణం వందే జగద్గురంమ్ చిత్రం చేస్తున్నారు. దగ్గుబాటి రాణా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. ఈ చిత్రం కథ అక్రమ మైనింగ్ తవ్వకాలు, మైనింగ్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. బళ్లారి బేస్ గా కథనం నడుస్తుందని చెప్తున్నారు. గాలి జనార్ధన రెడ్డి పాత్రను బేస్ చేసుకుని ఆ పాత్రను రూపొందించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో రాణా బిటెక్ బాబు గా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు. మైనింగ్ మాపియా మీద యుద్దం ప్రకటించే కుర్రాడిగా రాణా కనిపిస్తాడని, అతను ఈ చిత్రంలో నాటకాలు వేస్తాడని అంటున్నారు.

  హీరో రాణా మాట్లాడుతూ...ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుందని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Trisha has been denying reports linking her with Tollywood star Rana Daggubati. The actress said, "It's baseless. Rana and I have been friends forever and it's not fair to link us or spread rumors about an engagement that didn't happen. I'm here to stay and I haven't even thought about marriage yet, I'm working on three Tamil movies."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X