twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముస్లింలతో రజనీ, జయతో రాధిక, సుప్రీంకి కమల్ నో

    By Bojja Kumar
    |

    చెన్నై: 'విశ్వరూపం' వివాదం పరిష్కారం దిశగా కమల్ హాసన్ సినీ మిత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ నటి రాధిక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను బుధవారం సాయంత్రం కలిసిరారు. విశ్వరూపం వివాదం పరిష్కారం అయ్యేలా సహకరించాలని, ఆ సినిమా విడుదల కాకుంటే కమల్ కోట్లాది రూపాయల నష్టం ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించారు.

    మరో వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కమల్ హాసన్ మద్దతు పకలడమే కాకుండా సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగారు. ముస్లిం సంఘాలతో గురువారం చర్చలు మొదలు పెట్టారు. సినిమా విడుదలకు ఒప్పుకునే విధంగా వారిని బుజ్జగించే ప్రతయ్నం చేస్తున్నారు.

    విశ్వరూపం చిత్రంపై నిషేదాన్ని ఎత్తి వేస్తూ మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయంపై మద్రాసు హైకోర్టు ధర్మాసనం స్టే విధించిన నేపథ్యంలో.... కమల్ సుప్రీం కోర్టుకు వెళతారని అంతా అనుకున్నారు. అయితే తనకు ఇప్పుడే సుప్రీంను ఆశ్రయించే ఉద్దేశ్యం లేదని, చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామనే నమ్మకం ఉందని కమల్ చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారానికి తన సినీ మిత్రులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

    విశ్వరూపం చిత్రం ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా..... ముస్లిం సంఘాల ఫిర్యాదుతో తమిళనాడు ప్రభుత్వం ఆచిత్రంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తమిళనాడు మినహా దాదాపు అన్ని చోట్లా ఈచిత్రం విడుదలైంది. తమిళనాడులో ఆ పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి జయలలిత కమల్ హాసన్ పై కక్ష సాధింపు చర్యలకు దిగడమే అనే విమర్శలు వినిపిస్తున్నారు.

    English summary
    Kamal Hassan said on Thursday he would not move the Supreme Court against a stay on his film 'Viswaroopam' by the Madras High Court even as Information and Broadcasting Minister Manish Tewari indicated that the government may consider amending the Cinematograph Act 1952.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X