»   »  నాగచైతన్యతో నటించడం లేదు: హన్సిక

నాగచైతన్యతో నటించడం లేదు: హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా ద్విపాత్రలు పోషిస్తున్న 'హలో బ్రదర్‌' రీమేక్‌లో తాను నటించడం లేదని ముద్దుగుమ్మ హన్సిక స్పష్టం చేసింది. నాగార్జున సూపర్‌హిట్‌ సినిమా 'హలో బ్రదర్‌'ను నాగచైతన్యతో రీమేక్‌ చేయడానికి కామాక్షి కళా మూవీస్‌ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వ భాధ్యతలు వహిస్తున్నారు.

కాగా ఒరిజినల్‌లో రమ్యకృష్ణ, సౌందర్య చేసిన పాత్రల్ని తమన్నా, హన్సిక చేయభోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రసార సాధనాల్లోనూ, అంతర్జాలంలోనూ ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఆ చిత్రంలో నటించడం లేదనీ, అసలు ఆ సినిమా కోసం తననెవరూ సంప్రదించలేదనీ ఆదివారం ట్విట్టర్‌ ద్వారా తేల్చేసింది హన్సిక.

ఈ రూమర్స్ కు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందంటూ అర్థించింది. కాగా మొదటిసారిగా రంజాన్‌ సందర్భంగా 'రోజా' (ఉపవాసం) పాటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు సరసన ఓ మల్టీసారర్‌ సినిమాలో నటిస్తోంది ఈ అందాల తార. వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దూసుకెళ్తా అనే టైటిల్ అనుకుంటున్నారు.

ఇక హన్సిక రీసెంట్ గా సింగం 2 లో స్టూడెంట్ గా చేసింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆమె బాగా ఒళ్లు చేసిందని చెప్పుకున్నా..ఆమె పాత్ర చివర్లో కథ మలుపు కి ఉపయోగపడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నటించిన అనుష్క కన్నా హన్సిక కే ఎక్కువ మార్కులు పడ్డాయి.

English summary
Hansika has said, ” so just wana clear the air, that I’m not doing ‘hello brother’ in telugu ! nor I’m approached ! please put a full stop to the rumors:).” . Hansika has confirmed that she’s not part of Hello Brother’s remake, contrary to the reports that she’ll be one of the lead roles in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu