»   » ఆ మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయలేం:రామ్ చరణ్

ఆ మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయలేం:రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను క్రితం సారి అనీల్ కపూర్ ని కలిసినప్పుడు..ఆయన ఏమన్నారంటే నా మగధీర చిత్రం చూసి చాలా ప్రేరణపొందానని,తన సోదురుడు,నిర్మాత బోనీకపూర్ ని ఈ చిత్ర్లం నన్నే హీరోగా పెట్టి రీమేక్ చేయమన్నానని చెప్పానన్నారు.అయితే తాను ఆ పాత్ర మళ్ళీ చేయటం ఇష్టపడనని క్రియర్ గా చెప్పానని,ఎందుకంటే మ్యాజిక్ మళ్ళీ మళ్లీ రీ క్రియేట్ చేయటం కష్టమని చెప్పారు.అలాగే హిందీ ఆఫర్స్ చాలా సార్లు వచ్చాయని,తనే సున్నితంగా తిరస్కరిస్తున్నానని అన్నారు.అయితే ఈ సంవత్సరం చివరకు బాలీవుడ్ సినిమా చేసే అవకాసం ఉందని అన్నారు.

రామ్ చరణ్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన మగధీర చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం హిందీలో రీమేక్ చేయాలంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.కానీ అవేమీ మెటిరియలైజ్ కాలేదు. ఈ విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ...బాలీవుడ్ లో చాలా మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు.వారంతా మగధీర లో హీరో వాత్ర చేయగలరు.అయితే హృతిక్ రోషన్,రణబీర్ కపూర్ మాత్రం ఇంకా ఫెరఫెక్ట్ గా సూటవుతారు అనిపిస్తుంది అని తేల్చి చెప్పారు.

English summary
Ram Charan opined that Hrithik Roshan and Ranbir Kapoor will fit the bill to play the role of Kalabhairava in the Hindi remake of his magnum opus 'Magadheera'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu