»   » నేను, మా ఆవిడ, అబ్బాయి ఎక్కడికైనా పారిపోతాం: ఎన్టీఆర్

నేను, మా ఆవిడ, అబ్బాయి ఎక్కడికైనా పారిపోతాం: ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్లు జై లవ కుశ షూటింగు, బిగ్ బాస్ వల్ల చాలా బిజీ బిజీగా గడపాల్సి వచ్చిందని ఎన్టీఆర్ తెలిపారు. వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు 'జై లవ కుశ' షూటింగులోనే గడపాల్సి వచ్చేదని, శుక్రవారం బయల్దేరి శనివారం మొత్తం లోనావాలా వెళ్లి బిగ్ బాస్ షో చేసి సండే మళ్లీ బయల్దేరి రావడం ఇలా గడిచిందని ఎన్టీఆర్ అన్నారు.

ఈ క్రమంలో నాకు దొరికే ప్రతి క్షణం, ప్రతి గంట ఫ్యామిలీతోనే గడిపాను. ఈ సమయంలో ఇతర విషయాలపై ఫోకస్ పెట్టలేదు. మా అబ్బాయితోనో, ప్రణతితోనో, అమ్మతోనో... లేక కళ్యాణ్ అన్నయ్యతోనో ఉండిపోయేవాడిని. ఇపుడు కాస్త రిలాక్స్ అయ్యాను కాబట్టి ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.


నేను, మా అబ్బాయి, ఆవిడ ఎక్కడికైనా పారిపోతాం

నేను, మా అబ్బాయి, ఆవిడ ఎక్కడికైనా పారిపోతాం

జై లవ కుశ షూటింగ్ పూర్తయింది, బిగ్ బాస్ కూడా పూర్తయింది ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అని ఇటీవల ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. తప్పకుండా టూర్ వెళ్లాల్సిందే.... నేను, మా ఆవిడ, అబ్బాయి ఎక్కడికైనా పారిపోతాం అని ఎన్టీఆర్ చమత్కరించారు.


వాడికి స్కూల్ మిస్సవ్వకుండా

వాడికి స్కూల్ మిస్సవ్వకుండా

‘మా అబ్బాయికి ఇప్పుడే స్కూల్ మొదలైంది. వాడు స్కూల్ మిస్సవ్వకుండా... నా ఫ్యామిలీ టైమ్ మిస్సవ్వకుండా తప్పకుండా పారిపోతాం. కొన్ని నెలలు టూర్ ప్లాన్ చేస్తున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.


ఈ వార్తలు నిజమే అన్నమాట?

ఈ వార్తలు నిజమే అన్నమాట?

‘జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండనుంది. జనవరి చివర్లో లేదా, ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ గ్యాపులో ఎన్టీఆర్ విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తాజాగా కామెంట్స్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.


ఒంట్లో మలినాలు తొలగించుకునేందుకు థెరపీ

ఒంట్లో మలినాలు తొలగించుకునేందుకు థెరపీ

‘జై లవ కుశ' షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ యూరఫ్ వెలుతున్నట్లు సమాచారం. అక్కడే దాదాపు ఓ నెల రోజులు మకాం వేయనున్నారని, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించుకునేందుకు 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడని తెలుస్తోంది.


ఫ్యామిలీతో రిలాక్స్

ఫ్యామిలీతో రిలాక్స్

ఈ విదేశీ ట్రిప్‌కు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెళతారని సమాచారం. ఇంత కాలం షూటింగు బిజీ కారణంగా భార్య, కొడుకుతో సరిగా సమయం గడపలేక పోయిన ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ థెరపీ తీసుకుంటూ రిలాక్స్ అవుతారని సమాచారం.


మలేషియాలో మార్షల్ ఆర్ట్స్

మలేషియాలో మార్షల్ ఆర్ట్స్

యూరఫ్‌లో 'డీ టాక్సినేషన్ థెరపీ' ముగిసిన అనంతరం ఆయన మలేషియా వెళతారని, అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటారని తెలుస్తోంది. పిబ్రవరిలో ప్రారంభం అయ్యే త్రివిక్రమ్ సినిమా కోసమే ఈ ట్రైనింగ్ తీసుకుంటారని టాక్.


జై లవ కుశ

జై లవ కుశ

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసింది.


అనసూహ్య స్పందన

అనసూహ్య స్పందన

ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో "జై లవ కుశ" చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను "జై లవ కుశ" ట్రైలర్ సంపాదించుకుంది.


అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

"యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం" అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.


తెర వనక

తెర వనక

కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి.


English summary
Jai Lava Kusha movie shooting is complete. Big boss will also end this week. After this, Tarak is planning a tour with his family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu