»   » మీ అక్కా, చెల్లెళ్ళని ఇలాగే అడుగుతారా? నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు: ఇలియానా అసహనం

మీ అక్కా, చెల్లెళ్ళని ఇలాగే అడుగుతారా? నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు: ఇలియానా అసహనం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actor Ileana D’Cruz Says About Her Dating

తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చిందీ భామ 'దేవదాసు' సినిమాతో. 'పోకిరి' ఇలియానా ఫేట్‌ని మార్చేసింది. భారీ సక్సెస్‌లు, అంతకన్నా పెద్ద డిజాస్టర్లు ఇలియానా కెరీర్‌లో వున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమై, బాలీవుడ్‌ సినిమాలతో సరిపెడుతున్న ఇలియానా, తన బాయ్‌ఫ్రెండ్‌తో కొంతకాలంగా 'డేటింగ్‌'లో బిజీ బిజీగా వుంది. ఫొటోలూ, ముద్దులూ, హాలిడే లూ ఇలా అభిమానులందరికీ పండగచేసింది...

జస్ట్‌ స్నేహితుడు మాత్రమే

జస్ట్‌ స్నేహితుడు మాత్రమే

మొదట్లో బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోస్‌ గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే, 'జస్ట్‌ అతను స్నేహితుడు మాత్రమే.. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు..' అని చెప్పేది ఇలియానా. తర్వాత్తర్వాత, 'డేటింగ్‌ చేస్తే తప్పేంటి..' అని అమాయకంగా ప్రశ్నించేది. ఇప్పుడు మాత్రం, అతను తనకు లవర్‌.. అని బాహాటంగానే చెబుతోంది. అంతేనా, తనను పూర్తిగా అర్థం చేసుకున్న ఆండ్రూ, తన జీవిత భాగస్వామి అయ్యేందుకు అన్ని అర్హతలూ కలిగి వున్నవాడంటూ చెప్పేసింది....

బాద్‌షాహో

బాద్‌షాహో

ఆమధ్య రుస్తోం సినిమా తో పెద్ద హిట్టే తెచ్చుకున్నా మళ్ళీ పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇప్పుడు మళ్ళీ 'బాద్‌షాహో' సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా ఈమెపై తాజాగా జరుగుతున్న పరిణామాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహించింది ఇలియానా. ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కడికి వెళ్లినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూనీబోస్ గురించే అడుగుతుండటం తనకు బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే

నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే

'పబ్లిక్‌లో ఉన్న ప్రతీ సందర్భంలోనూ నవ్వుతూ కనిపించడం సాధ్యపడకపోవచ్చు. నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే. పబ్లిక్ ప్రాపర్టీని కాదు. మీరు నా బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు. కానీ అతడి జాతి గురించి అడగటం బాధకలిస్తోంది. అతను తెల్లగా ఉండటం కారణంగానే నేను డేటింగ్ చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు.

మీ వాళ్ళకిచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు

మీ వాళ్ళకిచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు

నేను చేస్తున్నది తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మీ తల్లులు, చెల్లెల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నారా..? మీ వాళ్ళకిచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచింది ఇలియానా. పెళ్ళి గురించిన ఆలోచన ప్రస్తుతానికి లేదంటూ ఇలియూనా తప్పించేసుకుంది. ఇంతకీ ఇలియానా, తన బాయ్‌ఫ్రెండ్‌తో స్నేహాన్ని ప్రేమదాకా తీసుకొచ్చింది సరే.. పెళ్ళి పీటలెక్కిస్తుందా.? ఏమో మరి, ఆమెకే తెలియాలి.

English summary
Actor Ileana D’Cruz says people often throw racist comments at her saying that she is dating her Australian boyfriend Andrew Kneebone because of his skin colour.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu