For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ టీఆర్పీ ఆటలోకి నన్ను లాగొద్దు.. నా భార్య, పిల్లలే ముఖ్యం: కౌశల్ రిక్వెస్ట్

|

'బిగ్ బాస్ 2' టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ మండ తెలుగు రాష్ట్రాల్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ రియాల్టీ షో ద్వారా వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుని, కౌశల్ ఆర్మీ పేరుతో ఏర్పడిన అభిమానాన్ని బాగా వాడేసుకుని... వీలైతే సినిమా సెలబ్రిటీగా, లేక పోతే పాలిటికల్ సెలబ్రిటీ ఎదిగాలని ఆశపడ్డాడు. అయితే కౌశల్ ఆర్మీలోని సభ్యులకు, కౌశల్ మండకు మధ్య ఏర్పడిన విబేధాలు చివరకు కౌశల్ సెలబ్రిటీ స్టేటస్ ఒకే ఒక్క రాత్రిలో కుప్పకూలిపోయేలా చేశాయి. ఒకరి తప్పులను ఒకరు వేలెత్తి చూపుకుంటూ... ఇటు కౌశల్, అటు కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియాకెక్కిన సంగతి తెలిసిందే.

మీడియాకు దూరంగా కౌశల్

మీడియాకు దూరంగా కౌశల్

ఇరు వర్గాల్లో తప్పు ఎవరిది? అంటే ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. వీరి మధ్య జరిగే గొడవలు ఏ పనీ లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుండే జనాలకు మంచి టైం పాస్ కార్యక్రమంలా తయారయ్యాయి. దీంతో కొన్ని మీడియా సంస్థలు ఇరు వర్గాలను పిలిచి డిబేట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రెండు మూడు టీవీ ఛానల్స్‌కు కౌశల్ వెళ్లి మాట్లాడగా... ఆయా షోలకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మరిన్ని ఛానల్స్ వారు కూడా కౌశల్‌తో షోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ ఛానల్ వెళ్లినా చివరకు తనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తుండటంతో కౌశల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

మీ టీఆర్పీల ఆటలోకి నన్ను లాగొద్దు

మీ టీఆర్పీల ఆటలోకి నన్ను లాగొద్దు

ఈ విషయాన్ని కౌశల్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడిస్తూ... ‘నాపై వచ్చే సిల్లీ ఆరోపణల విషయంలో మీడియా వారు నన్ను సంప్రదించడం ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఆ రోజు ప్రెస్ మీట్‌లోనే చూపించా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టం నన్ను శిక్షిస్తుంది. దయచేసి ఇక ఈ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు, మీ టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి నన్ను వాడుకోవద్దు' అంంటూ ట్వీట్ చేశారు.

నా కుటుంబం, పిల్లల బాధ్యతే ముఖ్యం

నా కుటుంబం, పిల్లల బాధ్యతే ముఖ్యం

అన్నింటికంటే నాకు నా భార్య, పిల్లలు, కుటుంబం ముఖ్యం. నా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. నా మెంటల్ హెల్త్, నా భార్య ఫిజికల్ హెల్త్ బాగోలేదు. ఈ ప్రభావం మా పిల్లలపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఇతర అంశాలన్నింటినీ పక్కన పెట్టే... ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను.. అని కౌశల్ తెలిపారు.

కౌశల్ మీద పాజిటివ్, నెగెటివ్ ఓపీనియన్స్

కౌశల్ మీద పాజిటివ్, నెగెటివ్ ఓపీనియన్స్

మీడియాలో కౌశల్, కౌశల్ ఆర్మీ రచ్చ తర్వాత.... సాధారణ ప్రజల నుంచి పాజిటివ్, నెగెటివ్ ఓపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. కొందరు కౌశల్‌కు మద్దతుగా, మరికొందరు అతడికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

కౌశల్ మీద విమర్శలు

కౌశల్ మీద విమర్శలు

కౌశల్ వ్యవహారం నచ్చని కొందరు అతడి మీద బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. కౌశల్ బిగ్ బాస్ హౌస్ నుంచే సింపతీ గేమ్ ఆడుతున్నాడంటూ కొందరు విమర్శిస్తున్నారు.

ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు

ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు

కొందరు మాత్రం కౌశల్‌కు మద్దతుగా తమ గళం వినిపిస్తున్నారు. నువ్వు ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టి ముందుకు సాగిబో బ్రదర్ అంటూ అతడిని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు.

English summary
"I'm requesting the media to stop contacting me regarding all these miniscule and silly accusations. All the proofs were shown at the press meet and law would take the action if I've done something wrong. So, please stop dragging and degralding us for the sake of TRP's. Before anything, it's my job to protect my wife. It's time for us to be there for one another as a family. My kids need me and I need them just as much since my mental health isn't any better than my wife's physical health. Just imagine what my kids are going through looking at both their parents in a low situation. We really don't have anyone to go to at this stage of our life. It's just us surviving against all the hurdles thrown our way. Thank you, for doing this to us!" kaushal manda said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more