Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆడ, మగ కలిస్తే అఫైరేనా? : బిపాస
ఆడ, మగ సన్నిహితంగా కలిస్తే ఎఫైరేనా? అంటూ ఫైర్ అవుతోంది బాలీవుడ్ హాట్ లేడీ బిపాస బసు. తాను ఇప్పడు ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని స్పష్టం చేసింది. లేనిపోని బంధాలు అండగట్టి తనను ఇబ్బంది పెట్టవద్దంటూ వేడుకుంటోంది.
రణబీర్ కపూర్ నటిస్తున్న 'రాక్ స్టార్" చిత్రానికి సంబంధించి బిపాస చేసిన వ్యాఖ్యలు వీళ్ల ఇద్దరి మధ్య 'సం"బంధం ఉందనే పుకార్లకు దారి తీశాయి. బాడీగార్డ్ చిత్ర ప్రమోషన్ సందర్భంగా సల్మాన్ తో సన్నిహితంగా మెలిగినందుకు ఇద్దరికీ లింకు ఉందంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో బిపాస బసు తీవ్రంగా స్పందించింది. నా ప్రొఫెషన్ లో భాగంగా చాలా మందిని కలుస్తుంటాను, మాట్లాడతాను, సన్నిహితంగా ఉంటాను... అంత మాత్రాన ఇద్దరి మధ్య ఎఫైర్ అండగడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన సహచర నటుడు జాన్ అబ్రహంతో బిపాస చాలా ఏళ్ల పాటు....సహజీవనం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె జాన్ తో విడిపోవడంతో, మళ్లీ ఎవరితో జతకడుతుందని సీని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి మీడియా హైప్ కూడా తోడవటంతో బిపాస ఎవరిని కలిసినా, ఎవరి గురించి మాట్లాడినా, ఎవరిని పొగిడినా అదో న్యూస్ అవుతోంది.