Just In
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 3 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Sports
ఆ ఒక్క కారణంతోనే కేదార్ జాదవ్‌ను ధోనీ వదిలేశాడు: గౌతం గంభీర్
- News
కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇదీ టాక్: శంకర్ కెరీర్లోనే వీక్ ‘ఐ’, ఫ్యాన్స్ అలా..
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్, చియాన్ విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఐ' మూవీ ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అద్భుత చిత్రంగా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 25000 స్క్రీన్లలో విడుదలైంది. ఇంత భారీ మొత్తంలో విడుదలైన తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడం గమనార్హం.
ఇప్పటికే అనేక చోట్లు ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు అభిమానులు. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన బట్టి విక్రమ్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అని అంటున్నారు. దర్శకుడు శంకర్ మరోసారి తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభను చాటారని అభిమానులు అంటున్నారు.
అయితే క్రిటిక్స్(సినీ విమర్శకులు) మాత్రం ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్ ఇస్తున్నారు. శంకర్ కెరీర్లోనే వీకెస్ట్ ఫిల్మ్ ఇదే అని తేల్చేస్తున్నారు. లెంత్ ఎక్కువగా ఉండటం, ఎమోషన్స్ సరిగా పండక పోవడం మైనస్ అంంటున్నారు. అయితే విక్రమ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని, విజువల్స్ బావున్నాయని విశ్లేషిస్తున్నారు.
సినిమా శంకర్, విక్రమ్ చిత్రాలకు వీరాభిమానులైన వారు మాత్రం...క్రిటిక్స్ అభిప్రాయాలకు భిన్నం సినిమా సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సినిమా స్క్రిప్టు బ్రిలియంట్‌గా ఉందని, నటీనటుల ప్రతిభ ఎక్సలెంటుగా ఉందని, డైరెక్షన్ బ్రిలియంట్ గా ఉందని, టెక్నికల్ వ్యాల్యూస్ అదిరిపోయానని అంటున్నారు. అదే విధంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు ఫ్యాన్స్. సినిమా ఒక డిపరెంటు పాత్ లో సాగుతుందని చెబుతున్నారు. అభిమానుల స్పందన ఎలా ఉందనే విషయం స్లైడ్ షోలో...

దినేష్ ట్వీట్ (@dineshk_moorthy)
ఫస్టాఫ్ సినిమా అద్భుతంగా ఉంది. మాటల్లో చెప్పలేం. చియాన్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అమీ జాక్సన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

శ్రీరామ్ ట్వీట్(@keyseri_soze)
‘ఐ' చిత్రం అద్భుతంగా ఉంది. విక్రమ్ పెర్పార్మెన్స్‌కు హాట్సాఫ్.

ముత్తు ట్వీట్ (@iamMuthuVelu)
ఇదో అద్భుతమైన సినిమా. శంకర్ డైరెక్షన్ ఎంత బావుంటుందో మరోసారి రుజువైంది.

రమేష్ ట్వీట్ (@rameshlaus)
ఐ చిత్రానికి రెస్పాన్స్ అదిరిపోయింది. మలేషియా, ఫ్రాన్స్, యూఎస్ఏ నుండి ఫీడ్ బ్యాక్ బావుంది. చియాన్ విక్రమ్ 100/100 మార్కులు కొట్టేసాడు.

కిబుబ నందన్ ట్వీట్ (@kiruba_17)
‘ఐ' చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతమైన చిత్రం.

మావెరిక్ మహరాజా(@maverickmaharaj)
శంకర్ ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించారు. శంకర్, విక్రమ్ ఈ చిత్రం కోసం అంకిత భావంతో పని చేసారు.

సుప్రజా రాజన్ (@s_chinnu_rajan)
చియాన్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఐ చిత్రం అందరికీ నచ్చుతుంది.

కార్తీక్ సుబ్రహ్మణ్యం(@Karthick_gsk)
ఐ చిత్రం విక్రమ్ వన్ మెన్ షో. డైరెక్షన్ అదిరి పోయింది.

రోహిత్ నిరంజన్(@RohitvNiranjan)
ఐ చిత్రం చాలా బావుంది. సినిమా ఔట్ పుట్ అదిరిపోయింది. విక్రమ్-శంకర్ కాంబినేషన్ మరోసారి బెస్ట్ అని తేలింది.

సిద్ (@sid2tweet)
విక్రమ్ లాంటి అద్భుతమైన నటుడు ఇండియాన్ సినిమా పరిశ్రమకు దొరకడం ఓ అదృష్టం. అతని పెర్పార్మెన్స్, అంకిత భావానికి హాట్సాఫ్.