For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తతో విడిపోయానంటూ మనీషా కొయరాలా...

By Srikanya
|

ముంబై : " నాకు అర్దం అయ్యింది ఏమిటంటే.. వైవాహిక జీవితం కొందరికే కలిసి వస్తుంది. అందరికీ కాదు. ముఖ్యంగా నాలాంటి వారికి కాదు. నేను,నా భర్త విడిపోయాం. నేను ప్రస్తనుతం ముంబైలో ఉంటున్నాను. మేమిద్దరం మంచి వాళ్లమే. ఆయన మీద నాకు ఏమీ కోపం లేదు. ఆయన కుటుంబం కూడా అధ్బుతమైంది. నేను వారిని ఏమీ అనదలుచుకోలేదు. అయినా అనటానికీ ఏమీ లేదు. ఇప్పటికీ ఆయన మీద,ఆ కుటుంబం మీద నాకున్న గౌరవం చెక్కు చెదరలేదు..అంతే." అంటూ మనీషా కొయరాలా తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది.

భారతీయుడు, బొంబాయి, క్రిమినల్ వంచి చిత్రాల ద్వారా పాపులరైన మనీషా రెండేళ్ల క్రితం సామ్రాట్ దహల్‌ని పెళ్లి చేసుకున్నారు. మొదట్లో కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కారణాలు బయటకు చెప్పలేదు కానీ తన భర్త నుంచి మనీషా ఇప్పుడు విడిపోయారు. తర్వాత ఆమె తాగుడుకి బానిసైంది. అయితే ఇప్పుడామె తాను అవన్నీ వదిలివేసానని, సినిమాలు తప్ప తనకు వేరే ప్రపంచం లేదంటూ మీడియాకు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తన కెరీర్ గురించి చెప్తూ... రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన 'భూత్ రిటర్న్స్'లో నటించాను. ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసారి హారర్ ఫిలిం మాత్రం కాదు. మలయాళంలో ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అన్నారు. త్వరలో దర్శకత్వం చేసే అలోచన ఉంది అని ఆమె తెలియచేసారు.

'భూత్ రిటర్న్స్'విషయానికి వస్తే... గతంలో తాను రూపొందించిన 'భూత్'కు సీక్వెల్‌గా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 3డి ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా. ఈ చిత్రాన్ని తెలుగులో 'బూచి' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన అనువాదన కార్యక్రమాలు మొదలు కానున్నాయి.

'భూత్ రిటర్న్' చిత్రం అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగు 'బూచి' టైటిల్‌తో రిలీజ్ చేయనున్న ఈచిత్రాన్ని మాత్రం అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి కానందునే ఈ చిత్రాన్ని తెలుగులో కాస్త లేటుగా విడుదల చేయబోతున్నారు. మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు.

English summary
Manisha Koirala says, "I now realize some people are meant for marriage, others are not. I am not. At the moment we’re separated. I am here (in Mumbai). Both of us are good people. I hold no grudges against him (her husband). His family is wonderful. I don’t want to hurt either his family or mine by saying anything. His folks are lovely folks. I respect him and his family. That’s all you’ll get out of me."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more