»   » కోర్టు తీర్పును గౌరవిస్తా: హీరో గోవిందా

కోర్టు తీర్పును గౌరవిస్తా: హీరో గోవిందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: కోర్టు తీర్పు ఏదైనా సరే.. దాన్ని గౌరవిస్తానని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందా అన్నారు. ఓ వ్యక్తిని కొట్టిన కేసులో క్షమాపణ చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు గోవిందాను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గోవిందా మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అహంభావం లేదని, అంతేగాక కోర్టు తీర్పును ఎల్లప్పుడూ గౌరవిస్తానని తెలిపారు.

కేసు వివరాల్లోకి వెళితే...ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందాకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2008లో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన కేసులో బాధితుడికి క్షమాపణలు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఈ హీరోకు సూచించింది.

గోవిందా గతంలో సంతోష్‌ రాయ్‌ అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన కేసును ముంబయి హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాయ్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

I respect Supreme Court’s order:Govinda

జస్టిస్‌ టి.ఎస్‌.ఠక్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో క్లిప్‌లను పరిశీలించిన తర్వాత గోవిందాకు ఈ సూచన చేసింది. రీల్‌లైఫ్‌ లో చేసినట్లు రియల్‌ లైఫ్‌లో చేయకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

'మేము మీ సినిమాలను చూసి ఆనందిస్తాం.. కానీ మీరు ఇలా నిజజీవితంలో ఎవరినైనా చెంపదెబ్బ కొడితే హర్షించలేము'అని ఆయన అన్నారు. ప్రజల మనిషిగా ఉండేవారు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోమని సలహా ఇచ్చారు. అనంతరం విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేశారు.

English summary
Govinda, who has been asked to apologise to the man he had slapped said, "I have the highest respect and regards for Supreme Court and the decision given."
Please Wait while comments are loading...