»   » సూర్య ఫ్యాన్స్ ఎఫెక్ట్: మాట మార్చిన కరీనా!

సూర్య ఫ్యాన్స్ ఎఫెక్ట్: మాట మార్చిన కరీనా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య గురించి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. సూర్య ఎవరో నాకు తెలియదు అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన ఆమె....సూర్య అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ కరీనా కపూర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.

'సూర్యను ఇప్పటి వరకు కలవలేదు అనేది నిజం. దాని అర్థం ఆయనంటే ఎవరో తెలియదని కాదు. ఆయన గురించి బాగా తెలుసు. తమిళ సినిమా పరిశ్రమలో పెద్ద స్టార్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనంటే గౌరవం. ఆయన నటించిన తమిళ చిత్రం సింగం చిత్రానికి రీమేక్‌గా వస్తున్న హిందీ చిత్రంలో కూడా నేను నటిస్తున్నాను' అని కరీనా కపూర్ తెలిపారు.

I respect Suriya and his work tremendously: Kareena

సూర్య నటిస్తున్న తమిళం చిత్రం 'అంజాన్'లో నేను ఐటం సాంగు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు విని అప్ సెట్ అయ్యాను. నేను అసలు ఆ చిత్ర దర్శకుడు లింగు స్వామిని ఇప్పటి వరకు కలవనేలేదు. సాంగు చేస్తున్నట్లు ఎలాంటి అంగీకారం కూడా తెలపలేదు. అలాంటపుడు నేను ఆయన చిత్రంలో ఐటం సాంగులో నటిస్తున్నట్లు ఆయన ఎలా చెబుతారు? అని కరీనా మండి పడ్డారు.

సూర్య హిందీలో సినిమా చేస్తే నేను తప్పకుండా చేస్తాను. సూర్య లాంటి పెద్ద హీరోతో చేయడం అంటే ఇష్టమే. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి వారితో చేయాలని ప్రతి నటి కోరుకుంటుందని కరీనా కపూర్ తెలిపారు. మొత్తానికి కరీనా వివరణ ఇవ్వడంతో సూర్య అభిమానులు కూల్ అయ్యారు.

English summary

 Actress Kareena Kapoor, who seems to have angered Tamil superstar Suriya's fans by saying she doesn't know him, has clarified that she knows him but has never met him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu