»   » పూరీ జగన్నాధ్ కి సారి చెప్పానంటున్న హీరోయిన్

పూరీ జగన్నాధ్ కి సారి చెప్పానంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ తన చిత్రంలో హీరోయిన్ గా చేయమంటూ అడిగారు. కానీ ఆ సమయంలో నాకు కాల్షీట్‌ కుదరకపోవడంతో ఆయనకు సారీ చెప్పాల్సి వచ్చింది అంటోంది లక్ష్మీరాయ్‌. "కాంచనమాల కేబుల్‌ టీవీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె తాజాగా లారెన్స్ హీరోగా చేస్తున్న 'సూపర్‌ కౌబోయ్‌' చిత్రంలో చేసింది. ఆ చిత్రం ప్రమేషన్ కోసం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కావాలనే పూరీ ప్రస్తావన తెచ్చి ఈ విషయం చెప్పింది. తనకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయని అయితే ఏదీ ఒప్పుకోలేకపోయానని చెప్తోంది. అంతేగాక తను కెరీర్ ప్రారంభించిన కొత్తలో అందరూ మంచి వారనుకుని వారు చెప్పిన మాటలు నమ్మి ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు ఆ పొరపాట్లు చేయనని అంటోంది. ఇక పూరీ తన తాజా చిత్రం గోలీమార్ కోసం గోపీచంద్ సరసన ఆమెను అడిగారు. అయితే ఆమె రిజెక్టు చేయటంతో ప్రియమణిని తీసుకున్నారు. ఈ విషయం చెప్పటం ద్వారా లక్ష్మీ రాయ్ మిగతా దర్శక,నిర్మాతలకు తాను పూరీ హీరోయిన్ గా కాబోయి ఆగాను, నాకు మంచి డిమాండ్ ఉందనే సంగతి అన్యాపదేశంగా చెప్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu