»   » ఆ గెటప్ ప్రకృతి కార్యాలకు అడ్డొచ్చింది: వెంకటేష్

ఆ గెటప్ ప్రకృతి కార్యాలకు అడ్డొచ్చింది: వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మనిషికి భయమనేది ఈ బాడీని గురించే.. ఇది ఏమయిపోతుందోనని దాన్ని మనసులో ఎక్కించుకుంటే నిజంగా భయపడిపోతాడు. మైండ్‌ ను చాలా కూల్‌ గా ఉంచుకోవాలి. ఈ బాడీకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇదంతా ఓ డ్రామాగా తీసుకోవాలి...అంటూ విక్టరీ వెంకటేష్‌ సూక్తులు వల్లించారు. 'నాగవల్లి' చిత్రం చేశాక...వెంకటేష్‌ కు ఏదో అవుతుందనే నెగెటివ్‌ టాక్‌ ఇండస్ట్రీలో వచ్చింది. కన్నడలో ఆప్తరక్షక చేశాక విష్ణువర్ధన్‌ కాలధర్మం చెందారు. దాంతో ఈ చిత్రాన్ని రజనీ చేసేందుకు వెనుకంజ వేసినట్టు ప్రచారం జరిగింది.

అటువంటి చిత్రాన్ని వెంకటేష్‌ టేకప్‌ చేశాడంటే ఇండస్ట్రీలో గుసగులసు మొదలయ్యాయి. ఇవన్నీ తనదాకా వచ్చాయని విక్టరీ వెంకటేష్‌ తన మనసులోని మాటను శనివారం ఆవిష్కరించారు. సినిమా విడుదలయ్యాక మహారాష్ట్ర వెళ్ళి వచ్చారు. అక్కడ ఆత్యాధ్మికలోకంలో గడిపాననీ, మళ్ళీ త్వరలో వెళ్ళనున్నానని చెప్పారు. రజనీకాంత్‌ కూడా అలా వెళతారు. మీకు కలుస్తారా? అని అడిగితే...మేం కాంటాక్ట్‌ లో ఉంటామని బదులిచ్చారు. రజనీకాంత్‌ గారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారంటూ... ఏదైనా జీవితంలో కొత్త ప్రయోగం చేయాలి. లేదంటే మనకు గుర్తింపు ఉండదని వెంకీ సెలవిచ్చారు. రాజు గెటప్‌కు 4 గంటలు మేకప్‌ వేసుకున్నాను. ఆ కాస్ట్యూమ్స్‌ వేసుకొన్నాక ప్రకృతి కార్యాలను అణచుకొన్నాను. అంతగా కష్టపడ్డాను అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu