»   » హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే

హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మహిళలు ఏ విషయంలోనూ మగాళ్ల కంటే తక్కువ కాదు. మగాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే వేతనాల విషయంలో మాత్రం మహిళలు మగాళ్ల కంటే తక్కువ పొందుతున్నారు. సినిమా పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి. హీరోలతో సమానంగా హీరోయిన్లకు వేతనం ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది.

తాజాగా ఈ డిమాండ్‌కు ప్రముఖ నటుడు, ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్ మద్దతు ప్రకటించారు. హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన వేతనాలు చెల్లించాలన్నారు. సమాన వేతన చట్టం తరహాలో ఏదైనా విధానం రావాలని పేర్కొన్నారు. ముంబైలో ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

I support actresses’ demand of wage system: Farhan Akhtar

‘వేతం విషయంలో రాజీ పడొద్దు. మీకు తగిన వేతనం ఆవ్వడం లేదని భావిస్తే ఆఫర్ తిరస్కరించండి. ఇది మీ పర్సనల్ చాయిస్. ఈ విషయంలో హీరోయిన్లుక నేను నా పూర్తి మద్దతు ఇస్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇష్టం ఉన్న వారు ఫాలో అవ్వొచ్చు అన్నారు' అక్తర్.

పార్క్ ఎవెన్యూ నుండి న్యూ రేంజ్ ఆఫ్ డియోడరెంట్ లాంచ్ సందర్భంగా పర్హాన్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేసారు. పర్హాన్ అక్తర్ రన్ చేస్తున్న ఫౌండేషన్ మర్డ్(మెన్ అగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) కూడా జెండర్ ఈక్వాలిటీ మీద అవేర్ నెస్ కల్పిస్తోంది. తగిన నైపుణ్యం ఉన్నపుడు లింగబేదం లేకుండా సమాన వేతనాలు ఇవ్వాలని ఆయన అభిప్రాయ పడ్డారు.

English summary
“I read recently somewhere that there are many female actors, who said they would want to work on a wage system that works even for men and I completely support them. If I want to cast them and they say that to me, then that’s what I’ll give them. But I can only speak about myself in relation to casting for a film,” Farhan told reporters here.
Please Wait while comments are loading...