Just In
- 5 min ago
మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రవితేజ: ఆరోజే అలరించబోతున్న మాస్ మహారాజా
- 19 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 25 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 40 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
Don't Miss!
- News
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు... తేల్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్...
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిర్మాత బండ్ల గణేష్ సెటిల్ మెంట్ కు నయీం లింక్, ప్రాణహాని ఉన్నా
హైదరాబాద్: నటుడు సచిన జోషి వద్ద గణేశ రూ. 20 కోట్లు అప్పు తీసుకున్నారని, ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతుంటే సచిన ఈ విషయాన్ని నయీం దృష్టికి తీసుకెళ్లాడన్నారు. గణేశ నుంచి నయీం రూ. 8.5 కోట్లు వసూలుచేసి సచినకు ఇచ్చాడని పేర్కొన్నారు. తాను చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తానని, ఇవి కావాలని చేస్తున్న ఆరోపణలు కాదని నట్టి కుమార్ అన్నారు.
అలాగే ... సినిమా నిర్మాతలు సి. కల్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణ, అశోక్‌కుమార్, బండ్ల గణేశ, నటుడు సచిన జోషికి నయీం ముఠాతో సంబంధాలున్నాయని నట్టి కుమార్ ఆరోపించారు.
నట్టికుమార్ మాట్లాడుతూ...నాకు ప్రాణహాని ఉందని తెలుసు. అయినా బయటకు వచ్చి ఇవన్నీ చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. నయీముద్దీన బాధితుల్లో తానూ ఉన్నానని సినీ నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు. అంతేగాక చిత్రసీమలోని కొంతమంది నిర్మాతలకు నయీం అండదండలున్నాయని ఆరోపిస్తూ వారి పేర్లను బహిర్గతం చేశారు. తనకు ప్రాణహాని ఉన్నా నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విషయాల్ని వెల్లడిస్తున్నానన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో తాను లీజు తీసుకున్న వెంకటేశ్వర మహల్ థియేటర్‌ను రెండు నెలల క్రితం నయీం ముఖ్య అనుచరుడు జగ్గిరెడ్డి మనుషులు బలవంతంగా లాగేసుకున్నారని, థియేటర్‌ను తమకు అప్పగించాలని అజీజ్‌రెడ్డి, ఆసిఫ్ అనేవాళ్లు తనకు ఫోన చేశారని, తాము 'భాయ్' మనుషులమని తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి చెందిన గెస్ట్‌హౌ్‌సలో నయీం అనుచరులు ఉన్నారని, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. కళ్లముందే నయీం అనుచరులు తిరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదో అర్థంకావట్లేదని అన్నారు.
ఇక డీఎస్పీ సహా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వాళ్లు కేసు నమోదు చేయలేదన్నారు. దాంతో న్యాయం కోసం తాను హైకోర్టుకు వెళ్లానని చెప్పారు. ఉత్తరాంధ్రలోని అత్యధిక థియేటర్లలో క్యాంటిన బిజినెస్ అంతా జగ్గిరెడ్డి అధీనంలోనే నడుస్తోందని, ఆయన బాధితుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు.