»   » అన్ని రకాలుగా మోసపోయానంటున్న హాట్ ఐటం గర్ల్

అన్ని రకాలుగా మోసపోయానంటున్న హాట్ ఐటం గర్ల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమావాళ్ళు మోసగాళ్ళు...నేను అన్ని రకాలుగా మోసపోయాను. ఇక నుంచి నేను వెండి తెరపై కనపడను. నాకు బాలీవుడ్ అంటే విరక్తి కలిగింది అనే స్టేట్ మెంట్స్ ఇస్తోంది ఐటం గర్ల్ రాఖీ సావంత్. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇలా కోపాన్ని వెళ్ళగక్కింది. అలాగే ఇకనుంచీ కేవలం టీవీ మీడియాకే పనిచేస్తా..అక్కడ కంపర్టుగా ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా తనను యష్ రాజ్ ఫిల్మ్ వారు మోసం చేసారని, వారి దిల్ బోలే హడియప్పా చిత్రం కోసం ఆరు నెలలు డేట్స్ తీసుకున్నారని, తెరపై చూస్తే చాలా చిన్న పాత్ర అని వాపోయింది. మొత్తం ఎడిటింగ్ చేసారని, అయినా ఆ సినిమా రాణి ముఖర్జీ కోసం తీసారని, మిగతా వారిపై దృష్టి అస్సలు లేదని అంది. అందుకే పెద్ద తెరకో నమస్కారం. అయినా అన్నాళ్ళుగా రాని గుర్తింపు నాకు ఒక్కసారిగా టీవీ మీడియా ద్వారా వచ్చింది. రాఖీ కా స్వయంవర్ హిట్టవటం నాకు కలిసివచ్చింది. నేనే ఇక్కడ మహారాణిని...ఎందుకు పెద్ద తెరను పలకరించి దెబ్బ తినాలి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రాఖీ కా ఇన్సాఫ్ అనే కొత్త రియాలటీ షోను ఇమేజన్ టీవీ కోసం చేస్తోంది. ఇక ఐటం సాంగ్స్ గురించి చెబుతూ నేను అవి చేయటానికి సిగ్గు పడను..ఎందుకంటే భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు అని ముగించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu