»   » ఫస్ట్ డే..ఫస్ట్ షో..బ్లాక్ లో కొనుక్కుని చూస్తా... రామ్ గోపాల్ వర్మ

ఫస్ట్ డే..ఫస్ట్ షో..బ్లాక్ లో కొనుక్కుని చూస్తా... రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడే రవితేజ తాజా చిత్రం మిరపకాయ ట్రైలర్ చూసానని, చాలా ఎంజాయ్ చేసానని, ఈ చిత్రం టిక్కెట్టుని ఫస్ట్ డే..ఫస్ట్ షో..బ్లాక్ లో కొనుక్కుంటానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో కామెంట్ చేసారు. ఇక ఈ మధ్య రవితేజపై ప్రత్యేక అభిమానం చూపుతూ వస్తున్న వర్మ...మిరపకాయ చిత్రం ఆడియో పంక్షన్ కు కూడా హాజరయ్యారు. ఈ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఆయన...ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ మాస్‌ మహరాజ్‌ రవితేజ. ఆయన చెప్పిన టైటిలే 'మిరపకాయ్‌'. తమన్‌ చక్కటి సంగీతం అందించాడన్నారు. రమేష్‌ పుప్పాల నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు. రవితేజ మాట్లాడుతూ...నాకు బాగా ఇష్టమైన వ్యక్తి హరీష్ ‌శంకర్‌. తనలో మంచి నటుడున్నాడు. నా కోసం కాకపోయినా హరీష్ ‌కోసం ఈ సినిమా ఆడాలి అన్నారు. మరివీరందరి ఆశ నెరవేరాలని కోరుకుందాం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది. అలాగే రామ్ గోపాల్ వర్మ,సునీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు కూడా సంక్రాంతి రోజే విడుదల అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu