»   » కూతురుని తెరపై చూడాలంటూ సూపర్ స్టార్

కూతురుని తెరపై చూడాలంటూ సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ పయనిస్తానని, నటననే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా వెల్లడించారు. ఇందుకు తన తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆమె పేర్కొంది. ధీరూభాయి అంబానీ హైస్కూల్‌ ఎంఎస్‌ఎస్‌ఏ ఏఐయు-14 బాలికల ఫుట్‌బాల్‌ జట్టుకు సుహానా నాయకత్వం వహించారు. ఆజాద్‌మైదానంలో జరిగిన ఫైనల్స్‌లో ధీరూభాయి అంబానీ జట్టు ఆర్య విద్యామందిర్‌ జట్టుపై 3-0 తేడాతో విజయం సాధించింది.

ఈ సందర్భంగా ఆమె ఓ దినపత్రికకు ఇచ్చి ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌ గురించి ఇప్పటికే తన తండ్రితో చర్చించానని, భవిష్యత్తు లక్ష్యంపై ఇప్పుడే నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. తన తండ్రి తనను నటన పాఠశాలల్లో భారతీయ, అంతర్జాతీయ సినిమాల గురించి చదువు కోవాలని సూచించారని సుహానా వెల్లడించారు.

I want to be an actress, says Suhana Khan

పాఠశాల విద్యాభ్యాసం పూర్తికాగానే తాను విదేశాలకు వెళ్లి నటన పాఠశాలలో చేరతానని తెలిపారు. బహుశా నటన కోసం అమెరికా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తన తండ్రిలాగా గొప్ప నటి కావాలన్నదే తన ధ్యేయమని వివరించారు. ఈ విషయంపై షారుక్‌ ఖాన్‌ స్పందిస్తూ సుహానా నటి కావాలనుకోవడంలో తప్పులేదన్నారు. ఆమెను వెండితెరపై చూడాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. తన కుమార్తెను చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

English summary

 Shah Rukh Khan was on top of the world today as his daughter, Suhana captained her school, Dhirubhai Ambani High School to their title win of the MSSA-MI U-14 girls football tournament. Shah Rukh Khan, the proud father was beside himself with joy as he tweeted his daughter’s achievement with a newspaper clip containing the news. He tweeted, ‘Am quite reticent when it comes to praising kids’ achievements but this is highly ‘show off worthy’. You go girl!!!’ Suhana has a natural knack towards sports. She also pursues Taekwondo and claims to be quite good at it. Moreover, she is into athletics such as the 100m sprint.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu