»   » ఏకంగా రాష్ట్రపతికే గురి పెట్టిన కత్రినా కైఫ్

ఏకంగా రాష్ట్రపతికే గురి పెట్టిన కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఫితూర్' షూటింగులో బిజీగా గడుపుతోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో కలిసి నటించిన కత్రినా.... అతనితో రొమాంటిక్ సీన్లు బాగా పడించింది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఈ ఇద్దరి మధ్య సినిమాలో ఉండే రొమాంటిక్ సీన్లే.

కాగా.... మూవీ ప్రమోషన్లో ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాల్లో కాకుండా ఇంకా ఏదైనా సాధించాలని ఉందా అనే ప్రశ్నకు కత్రినా స్పందిస్తూ...దేశానికి రాష్ట్రపతి కావాలని ఉందంటూ అందరికీ షాక్ ఇచ్చింది. కత్రినా నుండి అసలు ఇలాంటి సమాధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి బ్రిటిష్ పౌరురాలైన కత్రినా కోరిక తీరుతుందో? లేదో?

‘ఫితూర్' సినిమా విషయాల్లోకి వెళితే...కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' మూవీ ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ప్రేమికులకు సరిగ్గా రెండు రోజుల ముందు విడుదల చేయడం ద్వారా బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

ఈ సినిమాలో కేవలం కత్రినా జుట్టుకు రంగు కోసం ఏకంగా రూ. 55 లక్షలు ఖర్చు పెట్టారట. ఫితూర్ మూవీ పోస్టర్లలో ఉన్న విధంగా ఆకట్టుకునేలా జట్టుకు ఎరుపు రంగు తెచ్చే ప్రొఫెషనల్స్ ముంబైలో దొరకలేదట.

లండన్ లో...

లండన్ లో...


లండన్ కు చెందిన హెయిర్ కలర్ నిపుణులతో కత్రినా ఆమె జుట్టుకు రంగు వేయించారు.

55 లక్షలు

55 లక్షలు


సినిమా షూటింగ్ జరిగినంత కాలం కత్రినాకు పలు దఫాలుగా జుట్టుకు ఎరుపు రంగు వేయించారు. ఇందుకోసం ప్రతి సారి ఆమె లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఆమెతో పాటు ఆమె మేనేజర్ కు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, లండన్లో ఉండటానికి ఫైవ్ స్టార్ హోటల్ లో అకామిడేషన్.... ఇలా అన్ని కలిపి కేవలం కత్రినా జుట్టుకు రంగు కోసం రూ. 55 లక్షలు ఖర్చు పెట్టారట.

రొమాన్స్

రొమాన్స్


ఆదిత్యరాయ్ కపూర్‌తో కలిసి నటించిన కత్రినా.... అతనితో రొమాంటిక్ సీన్లు బాగా పడించింది.

టబు

టబు


ఈ చిత్రంలో టబు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.

English summary
When asked what 'fitoor' (obsession or madness) is in her mind apart from the film, Katrina said, "I want to be the president of a country. That's the 'fitoor' going on in my mind right now to take over the world."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu