twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుడు బాత్రూమ్ కి వెళ్ళటానికి కూడా ఆలోచించాలి: రెహమాన్

    రెహమాన్ తన కోరిక బయట పెట్టాడు. ఇంతకీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోరికేంటో తెలుసా? ప్రేక్షకులను బాత్రూమ్‌కి కూడా వెళ్లనివ్వకుండా కూర్చోబెట్టాలని అట.

    |

    అల్లా రఖా రెహమాన్ అలియాస్ దిలీప్ కుమార్ ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న మ్యూజీషియన్. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిలిం మ్యూజిక్... ఇప్పుడంటే ఇన పేరూ, గుర్తింపూ ఉన్నాయి గానీ ఒకప్పుడు రెహమాన్ అనే పిల్లవాడు భారతదేశ సినిమా ఇండస్ట్రీ లో కనీసం ఆకలి తీరేంత డబ్బు కోసం కష్టాలు పడ్డాడు అని కొద్దిమందికే తెలుసు...

    అతి చిన్న వయసులోనే

    అతి చిన్న వయసులోనే

    తన తండ్రి వదిలి వెళ్లిన సంగీత పరికరాలను అద్దెకు ఇచ్చి, వచ్చే ఆ ఆదాయమే వారి కుటుంబానికి అండగా నిలిచింది. అతి చిన్న వయసులోనే తన తండ్రి నేర్పించిన కీ-బోర్డుతో అమాయకమైన ముఖంతో అవకాశాలకోసం, కుటుంబ పోషణ కోసం చెన్నైలోని సినిమా స్టూడియోలవెంట కాళ్ళరిగేలా తిరిగాడు.

    తండ్రి నేర్పిన సంగీతం

    తండ్రి నేర్పిన సంగీతం

    చెన్నైలోని రికార్డింగుల స్టూడియోలే అతనికి పాఠశాలలయ్యాయి. తన తండ్రి నేర్పిన సంగీతం ఆసరాతోనే జీవితాన్ని చదవనారంభించాడు. అతి చిన్నవయస్సులోనే సింథసైజర్ వాయించడంలో ప్రావీణ్యం సాధించాడు. తండ్రిలేని లోటును పూడ్చడానికి తన చెల్లెళ్ళకు మంచి చదువునిప్పించడానికి తగిన కృషి చేశాడు.

    కీ బోర్డును అద్దెకు తీసుకుని

    కీ బోర్డును అద్దెకు తీసుకుని

    వారి కుటుంబానికి సహాయం చేసేవారే లేరు. అలాంటి పరిస్థితులలో ఓ కీ బోర్డును అద్దెకు తీసుకుని చిన్న చిన్న కచేరీలు చేయనారంభించాడు. అలా వచ్చిన రెహమాన్ మణిరత్నం రోజా సినిమాతో భారత దేశం మొత్తాన్నీ ఒక సంగీత సాగరం లో ముంచెత్తాడు. దక్షిణ, ఉత్తరాదుల భేదం లేకుండా రెహమాన్ సంగీతం అంటే చెవి కోసుకునే అభిమానులను సంపాదించుకున్నాడు.

    కాన్సర్ట్ టూర్లతో ఓ డాక్యుమెంటరీ

    కాన్సర్ట్ టూర్లతో ఓ డాక్యుమెంటరీ

    అలాంటి రెహమాన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టాడు. తొలిసారి కాన్సర్ట్ టూర్లతో ఓ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాడు. ఈ సందర్భం లోనే రెహమాన్ మీడియాతో మాట్లాడాడు. ఒక మ్యూజిషియన్ గా తన కోరిక ఏంటో కూడా బయట పెట్టాడు. ఇంతకీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోరికేంటో తెలుసా? ప్రేక్షకులను బాత్రూమ్‌కి కూడా వెళ్లనివ్వకుండా కూర్చోబెట్టాలని అట.

    సంగీతాన్ని ఎక్కడ మిస్ అవుతామో అని

    సంగీతాన్ని ఎక్కడ మిస్ అవుతామో అని

    అంత గొప్పగా మ్యూజిక్ చేయాలని ఉందట. ఒక సినిమా లేదా, కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు బాత్రూమ్‌కి అనో.. పాప్‌కార్న్ కోసమనో బయటకు వెళ్తే సంగీతాన్ని ఎక్కడ మిస్ అవుతామో అని వెళ్లకుండా సీట్లోనే కూర్చునేంత అద్భుతంగా మ్యూజిక్ ఆవిష్కరించాలని అనుకుంటున్నట్టు ఏఆర్ రెహ్మాన్ తెలిపారు. చెప్పటానికి కాస్త కామెడీ అనిపించినా ఆ స్టేజ్ ని అందుకోవటం మామూలు విషయం కాదు. కానీ ఆ మాటలన్నది రెహమాన్.

    English summary
    Oscar winning composer AR Rahman calls for more freedom and recognition for musicians across India, and feels that filmmakers often end up telling composers what to do, instead of asking them what to do.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X